కేసీఆర్‌కు జగన్ లేఖ... స్పందన బట్టే ఫలితం
ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇటీవల వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలిశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను జాతీయ స్థాయిలో కాపాడుకునేందుకే చర్చలు జరిపినట్టు వివరించారు. ఈ భేటీపై ఒకవైపు సానుకూలత, మరోవైపు టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈనేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్ జగన్ లేఖ రాశారు. చాలా కాలంగా నలుగుతున్న అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీకి సంబంధించిన విషయంపై వైఎస్ జగన్ లేఖ రాశారు. బదిలీల వ్యవహారంలో ఉద్యోగులు మనోవేధన చెందుతున్నారని… వెంటనే సమస్యను పరిష్కరించాలని […]
ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇటీవల వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలిశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను జాతీయ స్థాయిలో కాపాడుకునేందుకే చర్చలు జరిపినట్టు వివరించారు. ఈ భేటీపై ఒకవైపు సానుకూలత, మరోవైపు టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈనేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్ జగన్ లేఖ రాశారు.
చాలా కాలంగా నలుగుతున్న అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీకి సంబంధించిన విషయంపై వైఎస్ జగన్ లేఖ రాశారు. బదిలీల వ్యవహారంలో ఉద్యోగులు మనోవేధన చెందుతున్నారని… వెంటనే సమస్యను పరిష్కరించాలని జగన్ లేఖలో కోరారు. మానవతా దృక్పథంతో బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని లేఖలో జగన్ విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖకు తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్… తప్పనిసరిగా జగన్ లేఖకు సానుకూలంగానే స్పందించే అవకాశం అధికంగా ఉంది.
రెండు రాష్ట్రాల నాయకత్వం కలిసిమెలిసి ఉంటే అనేక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయన్న సందేశం పంపేందుకైనా కేసీఆర్ తప్పనిసరిగా జగన్ లేఖకు సానుకూలంగానే స్పందించి ఉద్యోగుల సమస్యను పరిష్కరించే చాన్స్ ఉంది.
అలా చేయడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక సానుకూల సందేశం పంపినట్టు అవుతుంది. చూడాలి… తెలంగాణ ప్రభుత్వం జగన్ లేఖ పట్ల ఎలా స్పందిస్తుందో!.