మళ్లీ బాబే ముఖ్యమంత్రి కావాలి- జగ్గారెడ్డి

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో సామాజిక కోణం అన్నది పని చేయడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎల్పీ నేత ఎన్నికలో రాహుల్ నిర్ణయం, లాబీయింగ్ పనిచేశాయని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ భట్టి విక్రమార్కకు మంచి అవకాశం ఇచ్చారన్నారు. తాను తప్ప కాంగ్రెస్‌లో అందరూ స్టార్లే అని సైటైర్ వేసుకున్నారు జగ్గారెడ్డి. హోమానికి తనను కేసీఆర్‌ ఆహ్వానిస్తారని అనుకోవడం లేదని… తనకు అంతటి ప్రోటోకాల్ లేదన్నారు. సీఎం దగ్గర సీఎల్పీ నేతకు ఉన్నంత ప్రాధాన్యత… పీసీసీ […]

Advertisement
Update:2019-01-20 08:53 IST

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో సామాజిక కోణం అన్నది పని చేయడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎల్పీ నేత ఎన్నికలో రాహుల్ నిర్ణయం, లాబీయింగ్ పనిచేశాయని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ భట్టి విక్రమార్కకు మంచి అవకాశం ఇచ్చారన్నారు.

తాను తప్ప కాంగ్రెస్‌లో అందరూ స్టార్లే అని సైటైర్ వేసుకున్నారు జగ్గారెడ్డి. హోమానికి తనను కేసీఆర్‌ ఆహ్వానిస్తారని అనుకోవడం లేదని… తనకు అంతటి ప్రోటోకాల్ లేదన్నారు. సీఎం దగ్గర సీఎల్పీ నేతకు ఉన్నంత ప్రాధాన్యత… పీసీసీ చీఫ్‌కు ఉండదన్నారు. వచ్చే ఎన్నికల వరకు పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌నే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉత్తమ్‌ విషయంలో సర్వే సత్యనారాయణకు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తోందన్నారు.

చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని కితాబిచ్చారు. 2014లో సీఎం అయినట్టుగానే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టుగానే అమరావతిని కూడా చంద్రబాబు అభివృద్ధి చేస్తారని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Similar News