వావిలాల వర్సెస్ ఎన్టీఆర్ " కొత్త వివాదం
అమరావతి ప్రాంతంలో వావిలాల గోపాలకృష్ణయ్య ఘాట్ ను చెరిపేయడంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా స్పందిస్తున్నారు. వావిలాల సృతివనాన్ని తొలగించి ఎన్టీఆర్ ఉద్యాన వనంగా మార్చడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పంథా చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలుగు జాతికి ఉనికి ఎన్టీఆర్‌తోనే వచ్చిందన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలుగు జాతి అంటే తెలుగుదేశం పార్టీ కాదని గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబు సంకుచిత విధానాలతో మహానీయులను కూడా అవమానిస్తున్నారని విమర్శించారు. తెలుగు ప్రముఖుల్లో ఎన్టీఆర్ ఒక […]
అమరావతి ప్రాంతంలో వావిలాల గోపాలకృష్ణయ్య ఘాట్ ను చెరిపేయడంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా స్పందిస్తున్నారు. వావిలాల సృతివనాన్ని తొలగించి ఎన్టీఆర్ ఉద్యాన వనంగా మార్చడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు పంథా చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలుగు జాతికి ఉనికి ఎన్టీఆర్‌తోనే వచ్చిందన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలుగు జాతి అంటే తెలుగుదేశం పార్టీ కాదని గుర్తించుకోవాలన్నారు.
చంద్రబాబు సంకుచిత విధానాలతో మహానీయులను కూడా అవమానిస్తున్నారని విమర్శించారు. తెలుగు ప్రముఖుల్లో ఎన్టీఆర్ ఒక ప్రముఖుడు మాత్రమేనన్నారు. వావిలాల ఘాట్‌ను తిరిగి ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ ఉద్యాన వనాన్ని కావాలంటే మరో చోట ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు ఐవైఆర్.