ఇంటింటికి ఏసీ సరఫరా చేస్తాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వింత మాటలతో విస్మయం కలిగిస్తున్నారు. 2018 నాటికి అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం, వ్యవసాయంలో ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తానని ప్రకటించి గతంలో అందరూ ఆశ్చర్య పోయేలా చేశారు. (నోబెల్ ప్రైజ్‌ను కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, సాహిత్యం, శాంతి , ఆర్థిక రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు.) ఇప్పుడు అమరావతిపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కరెంట్, గ్యాస్‌ను ఇంటింటికి సరఫరా చేసినట్టుగానే ఇంటింటికి […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వింత మాటలతో విస్మయం కలిగిస్తున్నారు. 2018 నాటికి అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం, వ్యవసాయంలో ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తానని ప్రకటించి గతంలో అందరూ ఆశ్చర్య పోయేలా చేశారు. (నోబెల్ ప్రైజ్‌ను కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, సాహిత్యం, శాంతి , ఆర్థిక రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు.)
ఇప్పుడు అమరావతిపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కరెంట్, గ్యాస్‌ను ఇంటింటికి సరఫరా చేసినట్టుగానే ఇంటింటికి ఏసీని కూడా సరఫరా చేస్తామని ప్రకటించారు. అమరావతిలోని ప్రతి ఇంటికి ఏసీ సరఫరా చేసేలా చూడాలని ఆదేశాలిచ్చానని వెల్లడించారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై…. సోషల్ మీడియాలో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం కూడా అమరావతిపై చంద్రబాబు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో వేడి మరీ ఎక్కువగా ఉంటోందని… 10 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి షాక్‌కు గురి చేశారు చంద్రబాబు.