వైఎస్ జగన్‌ లండన్ టూర్ రద్దు....

వైఎస్ జగన్‌ లండన్ టూర్ రద్దయింది. సుధీర్ఘ పాదయాత్ర వల్ల చాలా కాలంగా పిల్లలతో జగన్‌ గడపలేకపోయారు. ఈ నేపథ్యంలో 15 నెలల తర్వాత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌ నుంచి లండన్ వెళ్లాల్సి ఉండగా…. జగన్‌ తన లండన్ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానికంగా ఉండడం చాలా ముఖ్యమని జగన్ భావించారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా దావోస్ పర్యటన రద్దు చేసుకుని […]

Advertisement
Update:2019-01-17 15:32 IST

వైఎస్ జగన్‌ లండన్ టూర్ రద్దయింది. సుధీర్ఘ పాదయాత్ర వల్ల చాలా కాలంగా పిల్లలతో జగన్‌ గడపలేకపోయారు. ఈ నేపథ్యంలో 15 నెలల తర్వాత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌ నుంచి లండన్ వెళ్లాల్సి ఉండగా…. జగన్‌ తన లండన్ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానికంగా ఉండడం చాలా ముఖ్యమని జగన్ భావించారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా దావోస్ పర్యటన రద్దు చేసుకుని వరుసగా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నేతలకు గాలం వేయడంతో పాటు… టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్లే నేతలను నిలువరించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు ఎన్నికల వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు.

ఈ నేపథ్యంలో తాను విదేశాలకు వెళ్లడం సరికాదని జగన్ నిర్ణయించుకున్నారు. జగన్‌ కూడా తక్షణమే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో ముఖాముఖి సమీక్షలు నిర్వహించబోతున్నారని సమాచారం.

కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో…తాను స్థానికంగా అందుబాటులో లేకపోతే అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించే జగన్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News