వైసీపీలోకి మల్లికార్జున రెడ్డి...

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన చర్చలు జరిపారు. విజయసాయిరెడ్డితో చర్చల తర్వాత వైసీపీలో చేరాలని ఆయన దాదాపు నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరులో ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలోకి వస్తున్న అంశంపై వైసీపీ పెద్దలు ఇప్పటికే రాజంపేట వైసీపీ నేతలు, ఇన్‌చార్జ్ అమర్‌నాథ్‌ రెడ్డితో […]

Advertisement
Update:2019-01-15 09:10 IST

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన చర్చలు జరిపారు. విజయసాయిరెడ్డితో చర్చల తర్వాత వైసీపీలో చేరాలని ఆయన దాదాపు నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరులో ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని చెబుతున్నారు.

మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలోకి వస్తున్న అంశంపై వైసీపీ పెద్దలు ఇప్పటికే రాజంపేట వైసీపీ నేతలు, ఇన్‌చార్జ్ అమర్‌నాథ్‌ రెడ్డితో చర్చించి లైన్ క్లియర్ చేశారు. నిజానికి మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరుతున్నట్టు ఐదు నెలల క్రితమే ప్రచారం జరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలిపించుకుని మేడా మల్లికార్జున రెడ్డిని బుజ్జగించారు.

కానీ నియోజకవర్గంలో తనకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉండడం లేదని మేడా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ విప్‌గా ఉండి కూడా తన మాట నియోజకవర్గంలో ఏమాత్రం చెల్లడం లేదని ఆయన చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మార్పుపై మల్లికార్జున రెడ్డి సోదరుడి నుంచి కూడా ఒత్తిడి ఉంది.

Tags:    
Advertisement

Similar News