మహిళా టీ-20 క్రికెట్లో మరో చెత్త రికార్డు
14 పరుగులకే చైనా ఆలౌట్ మహిళా టీ-20 చరిత్రలోనే ఘోర పరాజయం ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మరో చెత్త రికార్డు నమోదయ్యింది. 20 ఓవర్లలో 200కు పైగా పరుగులు చేయాల్సిన మ్యాచ్ లో ఓ జట్టు కేవలం 14 పరుగులకే కుప్పకూలింది. థాయ్ లాండ్ మహిళా టీ-20 స్మాష్ టోర్నీలో ఈ అసాధారణ రికార్డు నమోదయ్యింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రత్యర్థిగా ముగిసిన ఈమ్యాచ్ లో 204 పరుగుల భారీ టార్గెట్ చేజింగ్ కు దిగిన చైనా…కేవలం […]
- 14 పరుగులకే చైనా ఆలౌట్
- మహిళా టీ-20 చరిత్రలోనే ఘోర పరాజయం
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మరో చెత్త రికార్డు నమోదయ్యింది. 20 ఓవర్లలో 200కు పైగా పరుగులు చేయాల్సిన మ్యాచ్ లో ఓ జట్టు కేవలం 14 పరుగులకే కుప్పకూలింది. థాయ్ లాండ్ మహిళా టీ-20 స్మాష్ టోర్నీలో ఈ అసాధారణ రికార్డు నమోదయ్యింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రత్యర్థిగా ముగిసిన ఈమ్యాచ్ లో 204 పరుగుల భారీ టార్గెట్ చేజింగ్ కు దిగిన చైనా…కేవలం 10 ఓవర్లలో 14 పరుగులకే కుప్పకూలింది. కేవలం 48నిముషాలలోనే కుప్పకూలింది.
బ్యాటింగ్ ఆర్డర్ లో ఏడుగురు ప్లేయర్లు ఖాతా తెరవకుండానే డకౌట్ కావడం మరో అరుదైన రికార్డుగా మిలిగిపోతుంది.
189 పరుగుల తేడాతో ఓటమి పొందడం కూడా…అతిపెద్ద పరాజయంగా మహిళా క్రికెట్ రికార్డుల్లో చేరింది. గతంలో నమీబియా చేతిలో లెసోథో 179 పరుగుల తేడాతో ఓడితే…ఇప్పుడు చైనా 189 పరుగుల ఓటమితో ఆ రికార్డును తెరమరుగు చేసింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనాకు…క్రికెట్ పిచ్చి పట్టించాలన్న లక్ష్యంతో ఐసీసీ కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇస్తూ వస్తోంది. అత్యాధునిక సదుపాయాలు, శిక్షకులను అందుబాటులో ఉంచినా…పురుషుల, మహిళల విభాగాలలో చైనా చెత్తరికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది.