అలాంటి వారికి రిజర్వేషన్లు ఎందుకు?

అగ్రవర్ణాలకు విద్యా, ఉపాధి అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ సర్కార్‌  నిర్ణయం తీసుకోవడాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ స్వాగతించారు. ప్రస్తుతం సమాజాన్ని నిట్లనిలువునా చీలుస్తున్న సమస్యల్లో రిజర్వేషన్ల అంశం కూడా ఒకటి అని అభిప్రాయపడ్డారు. నిరుపేద అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడం సరైన చర్యే అని అభిప్రాయపడ్డారు. కాకపోతే రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూదని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ అంశం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మోడీ ప్రభుత్వ సంకల్పం […]

Advertisement
Update:2019-01-07 11:14 IST

అగ్రవర్ణాలకు విద్యా, ఉపాధి అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవడాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ స్వాగతించారు. ప్రస్తుతం సమాజాన్ని నిట్లనిలువునా చీలుస్తున్న సమస్యల్లో రిజర్వేషన్ల అంశం కూడా ఒకటి అని అభిప్రాయపడ్డారు.

నిరుపేద అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడం సరైన చర్యే అని అభిప్రాయపడ్డారు. కాకపోతే రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూదని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ అంశం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

మోడీ ప్రభుత్వ సంకల్పం సరైనదేనని… దీని వల్ల కొద్ది మేరకైనా రిజర్వేషన్ల కలహాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల పద్దతిని కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఎస్సీఎస్టీ, బీసీల్లో …. అప్పటికే రిజర్వేషన్ల వల్ల బాగుపడి పైకి ఎదిగిన వారే తిరిగి రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నారని జేపీ అభిప్రాయపడ్డారు.

ఒక ఐఏఎస్‌, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కుమారుడికి రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి కూడా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఆయా సామాజికవర్గంలోని నిరుపేదలే నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందలేకపోయిన వారికి అవకాశాలు దక్కేలా చూడాలన్నారు. ఒక సారి రిజర్వేషన్ల వల్ల ఉన్నతస్థాయికి వెళ్లిన వారి కుటుంబాలకు తిరిగి రిజర్వేషన్లు అందకుండా చూడాలన్నారు. నెలకు ఐదు వేల రూపాయలు ఫీజు చెల్లించే సామర్ధ్యం ఉన్న వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని జేపీ ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరం లేదని జేపీ వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News