ప్రో-కబడ్డీ లీగ్ 6వ సీజన్లో టైటిల్ సమరం

ముంబై వేదికగా మరికాసేపట్లో ఫైనల్స్ బెంగళూరు బుల్స్ తో గుజరాత్ ఢీ ప్రో- కబడ్డీ లీగ్ ఆరో సీజన్ టైటిల్ సమరానికి…ముంబై NSCI స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.  ప్రోకబడ్డీ లీగ్ చరిత్రలో సరికొత్త చాంపియన్ ఆవిష్కరణకు రంగం సిద్ధమయ్యింది. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్ల టైటిల్ ఫైట్ కు తొలిసారిగా అర్హత సంపాదించాయి. మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్, మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ లాంటి జట్లను అధిగమించి…బెంగళూరు, గుజరాత్ జట్లు ఫైనల్స్ […]

Advertisement
Update:2019-01-05 11:35 IST
  • ముంబై వేదికగా మరికాసేపట్లో ఫైనల్స్
  • బెంగళూరు బుల్స్ తో గుజరాత్ ఢీ

ప్రో- కబడ్డీ లీగ్ ఆరో సీజన్ టైటిల్ సమరానికి…ముంబై NSCI స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రోకబడ్డీ లీగ్ చరిత్రలో సరికొత్త చాంపియన్ ఆవిష్కరణకు రంగం సిద్ధమయ్యింది. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్ల టైటిల్ ఫైట్ కు తొలిసారిగా అర్హత సంపాదించాయి.

మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్, మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ లాంటి జట్లను అధిగమించి…బెంగళూరు, గుజరాత్ జట్లు ఫైనల్స్ చేరుకోగలిగాయి.

ఢీ అంటే ఢీ…

కెప్టెన్ రోహిత్ కుమార్, పవన్ షెరావత్ ల సూపర్ రైడింగ్ తో…లీగ్ దశలో అదరగొట్టిన బెంగళూరు బుల్స్…ఫైనల్లో గుజరాద్ ఫార్చ్యూన్ జెయింట్స్ నుండి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

గుజరాత్ జట్టులో సూపర్ రైడర్ సచిన్, పవర్ పుల్ డిఫెండర్ సునీల్ కుమార్…తమజట్టు జయాపజయాలలో ప్రధానపాత్ర వహించబోతున్నారు.

మరికాసేపట్లో జరిగే టైటిల్ సమరంలో తమజట్టు విజయం ఖాయమని బెంగళూరు బుల్స్ కెప్టెన్ రోహిత్ ధీమాగా చెబుతున్నాడు.

పట్నా పైరేట్స్ హ్యాట్రిక్….

2014 సీజన్ నుంచి నిర్వహిస్తూ వస్తున్న ప్రోకబడ్డీ లీగ్ తొలిసీజన్ టైటిల్ ను బెంగళూరు పింక్ పాంథర్స్ జట్టు గెలుచుకొంటే… 2015 సీజన్ లీగ్ టైటిల్ ను యూ-ముంబా కైవసం చేసుకొంది.

2016, 2017 సీజన్లలో జరిగిన మిగిలిన మూడు సీజన్ల లీగ్ లో…. పట్నా పైరేట్స్ కు ఎదురే లేకుండా పోయింది.

గత సీజన్ ఫైనల్లో సైతం గుజరాత్ ను ఓడించడం ద్వారా పట్నా పైరేట్స్ టైటిల్స్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. ప్రస్తుత సీజన్లో …బెంగళూరు, గుజరాత్ జట్లు ఫైనల్స్ చేరడంతో… సరికొత్త చాంపియన్ తెరమీదకు రావడం ఖాయమని తేలిపోయింది.

Tags:    
Advertisement

Similar News