65వేల మంది మహిళలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఘనమైన కానుక

రాజకీయాల్లో తనదైన పంథాలో ముందుకెళ్తుంటారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడంలో ప్రభాకర్ రెడ్డి పాత్ర కీలకమైనదే. అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటానని బహిరంగంగానే ఆ మధ్య ప్రభాకర్ రెడ్డి ప్రకటించి జాతీయ మీడియాను కూడా ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు సిద్దమవుతున్న ప్రభాకర్‌ రెడ్డి… ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ […]

Advertisement
Update:2019-01-05 05:27 IST

రాజకీయాల్లో తనదైన పంథాలో ముందుకెళ్తుంటారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడంలో ప్రభాకర్ రెడ్డి పాత్ర కీలకమైనదే. అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటానని బహిరంగంగానే ఆ మధ్య ప్రభాకర్ రెడ్డి ప్రకటించి జాతీయ మీడియాను కూడా ఆకర్షించారు.

వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు సిద్దమవుతున్న ప్రభాకర్‌ రెడ్డి… ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ తన కుమారుడిని ఆశీర్వదించాలని ఇప్పటి నుంచే కోరుతున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచు కొత్త చీరతో స్వాగతం పలికేలా చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఇందు కోసం నియోజకవర్గంలోని 65వేల మంది మహిళలకు 65వేల చీరలను పంపిణీ చేస్తానని ప్రకటించారు. సొంత డబ్బుతో ఈ 65వేల చీరలను ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేయబోతున్నారు.

40 ఏళ్లుగా తమ కుటుంబానికి రాజకీయంగా అండగా ఉంటున్న తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినా తాము ఇంకా రుణపడే ఉంటామని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రతి మహిళా తలెత్తుకుని బతకాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లు అన్న సామెతకు చరమగీతం పాడి అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News