సిడ్నీటెస్టుపై టీమిండియా పట్టు

మూడోరోజు ఆటలో కంగారూ ఎదురీత తొలిఇన్నింగ్స్ లో ఆసీస్ 6 వికెట్లకు 236 పరుగులు ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ మూడోరోజు టలోనే టీమిండియా పట్టు బిగించింది.  టీమిండియా భారీ తొలి ఇన్నింగ్స్ స్కోరు 622 పరుగుల స్కోరుకు సమాధానంగా… తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న కంగారూ టీమ్…6 వికెట్లకు 236 పరుగులతో ఎదురీదుతోంది. ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 24 పరుగులతో మూడోరోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఉస్మాన్ క్వాజా- హారిస్…. మొదటి వికెట్ […]

Advertisement
Update:2019-01-05 11:02 IST
  • మూడోరోజు ఆటలో కంగారూ ఎదురీత
  • తొలిఇన్నింగ్స్ లో ఆసీస్ 6 వికెట్లకు 236 పరుగులు
  • ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో ఆస్ట్రేలియా

సిడ్నీ టెస్ట్ మూడోరోజు టలోనే టీమిండియా పట్టు బిగించింది. టీమిండియా భారీ తొలి ఇన్నింగ్స్ స్కోరు 622 పరుగుల స్కోరుకు సమాధానంగా… తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న కంగారూ టీమ్…6 వికెట్లకు 236 పరుగులతో ఎదురీదుతోంది.

ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 24 పరుగులతో మూడోరోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఉస్మాన్ క్వాజా- హారిస్…. మొదటి వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

క్వాజా 27, హారిస్ 79 పరుగుల స్కోర్లకు ఒకరి వెనుక ఒకరు అవుట్ కావడంతో… ఆస్ట్రేలియా పతనం ప్రారంభమయ్యింది. వన్ డౌన్ లాబుస్ జేన్ 38, షాన్ మార్ష్ 8, ట్రావిస్ హెడ్ 20, కెప్టెన్ పెయిన్ 5 పరగులకు అవుటయ్యారు.

హాండ్స్ కోంబ్ 28, కమ్మిన్స్ 25 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జడేజా 2 వికెట్లు, షమీ ఒక వికెట్ పడగొట్టారు. ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడాలంటే… ఆస్ట్రేలియా మరో 386 పరుగులు చేయాల్సి ఉంది.

ఈ మ్యాచ్ లో టీమిండియా నెగ్గినా…లేక ..డ్రాగా ముగించినా…గత ఏడు దశాబ్దాల కాలంలో…కంగారూ గడ్డపై…తొలి టెస్ట్ సిరీస్ సాధించిన ఘనత సొంతం చేసుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News