జాతీయ మీడియా సర్వేలు.... బాబుకు మింగుడు పడవే!

ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో.. జాతీయ మీడియా వర్గాలు సర్వేల్లో నిమగ్నమయ్యాయి. ఈ సర్వేల్లో ప్రధానంగా ఒకే విషయంపై చర్చ జరుగుతూ ఉంది. మోడీ మళ్లీ ప్రధాని అవుతాడా? ఎన్డీయే మళ్లీ గద్దెనెక్కుతుందా అనే అంశాలపై చర్చ కొనసాగుతూ ఉంది. ఈ అంశాలపై ఎక్కువ సర్వేలు చెబుతున్న మాట ఏమిటంటే.. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుంది అనేది! కాస్త సీట్లు తగ్గవచ్చు కానీ.. మళ్లీ ఎన్డీయేకే అవకాశాలున్నాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ […]

Advertisement
Update:2019-01-05 12:28 IST

ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో.. జాతీయ మీడియా వర్గాలు సర్వేల్లో నిమగ్నమయ్యాయి. ఈ సర్వేల్లో ప్రధానంగా ఒకే విషయంపై చర్చ జరుగుతూ ఉంది.

మోడీ మళ్లీ ప్రధాని అవుతాడా? ఎన్డీయే మళ్లీ గద్దెనెక్కుతుందా అనే అంశాలపై చర్చ కొనసాగుతూ ఉంది. ఈ అంశాలపై ఎక్కువ సర్వేలు చెబుతున్న మాట ఏమిటంటే.. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుంది అనేది!

కాస్త సీట్లు తగ్గవచ్చు కానీ.. మళ్లీ ఎన్డీయేకే అవకాశాలున్నాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి.

ఇటీవల మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే ఆ ఉత్సాహం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం అవుతుందని వివిధ మీడియా సంస్థలు చెబుతున్నాయిప్పుడు.

తాజాగా ఇండియాటుడే చెబుతున్న లెక్కల ప్రకారం.. మోడీ హవా ఏ మాత్రం తగ్గలేదు అని, ఇప్పటికీ మోడీకే మెజారిటీ జనులు మొగ్గు చూపుతున్నారని.. ఢిల్లీ పరిధిలో అయితే నలభై తొమ్మిది శాతం మంది మోడీకి జై కొడుతున్నారని ఆ సర్వే అంటోంది.

అదే రాహుల్ గాంధీకి కేవలం నలభై శాతం మంది మొగ్గు చూపుతున్నారని ఇండియాటుడే అంటోంది.

అలాగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ.. లోక్ సభ ఎన్నికలప్పటికీ మళ్లీ బీజేపీకి అనుకూలత ఉంటుందని ఈ సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి జాతీయ మీడియా సర్వేలు మళ్లీ ఎన్డీయే… అని అంటున్నాయి. మోడీని దించుతాను అంటున్నబాబుకు ఈ సర్వేలు మింగుడు పడవేమో!

Tags:    
Advertisement

Similar News