ఐఏఎస్ చంద్రకళపై సీబీఐ మెరుపుదాడులు

ఐఏఎస్‌ అధికారిణి చంద్రకళపై సీబీఐ మెరుపుదాడులు చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన చంద్రకళ ఐఏఎస్‌గా ఉత్తర్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను నడిరోడ్డుపైనే నిలదీసి ప్రజల్లో మన్ననలు పొందారు. ఇప్పుడు ఆమె మరోసారి వార్తలొక్కి ఎక్కారు. ఆమె నివాసాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. యూపీలో జరిగిన మైనింగ్‌ కుంభకోణంలో చంద్రకళ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సీబీఐ దాడులు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో […]

Advertisement
Update:2019-01-05 11:00 IST

ఐఏఎస్‌ అధికారిణి చంద్రకళపై సీబీఐ మెరుపుదాడులు చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన చంద్రకళ ఐఏఎస్‌గా ఉత్తర్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను నడిరోడ్డుపైనే నిలదీసి ప్రజల్లో మన్ననలు పొందారు.

ఇప్పుడు ఆమె మరోసారి వార్తలొక్కి ఎక్కారు. ఆమె నివాసాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. యూపీలో జరిగిన మైనింగ్‌ కుంభకోణంలో చంద్రకళ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సీబీఐ దాడులు చేసింది.

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. లక్నోలోని చంద్రకళ నివాసంతో పాటు ఆమె స్వస్థలం కరీంనగర్‌ జిల్లాలోనూ సీబీఐ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలు తుంగలో తొక్కి మైనింగ్‌కు అక్రమ మార్గంలో చంద్రకళ అనుమతులు మంజారు చేసినట్టు ఆరోపణ. చంద్రకళతో పాటు పలువురు అధికారులు, నేతల ఇళ్లపైనా సీబీఐ దాడులు చేస్తోంది.

సీబీఐ దాడులు లక్నో, కరీంనగర్, కాన్పూర్, హమీర్‌పూర్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరిగాయి. చంద్రకళపై ఇప్పుడు సీబీఐ దాడులు చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది.

Tags:    
Advertisement

Similar News