ఎన్నికలు ఎదుర్కోవాలంటే రెండు వేల కోట్లు అవసరం....

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్. ప్రకాశం జిల్లా జనసేన నేతలతో సమావేశమైన పవన్‌ కల్యాణ్… 60 శాతం మంది కొత్తవారే జనసేన తరపున బరిలో ఉంటారని చెప్పారు. రాష్ట్ర సమతుల్యత కోసమే అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. సినిమాల్లో నటించడం తనకు సంతృప్తిని ఇవ్వలేదన్నారు.  ప్రజారాజ్యం స్థాపించేలా చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను కూడా ఒకడినని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యంలో […]

Advertisement
Update:2019-01-05 12:30 IST

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్. ప్రకాశం జిల్లా జనసేన నేతలతో సమావేశమైన పవన్‌ కల్యాణ్… 60 శాతం మంది కొత్తవారే జనసేన తరపున బరిలో ఉంటారని చెప్పారు.

రాష్ట్ర సమతుల్యత కోసమే అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. సినిమాల్లో నటించడం తనకు సంతృప్తిని ఇవ్వలేదన్నారు. ప్రజారాజ్యం స్థాపించేలా చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను కూడా ఒకడినని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యంలో బలమైన పాత్ర పోషించానని వివరించారు.

కానీ ఓపిక లేని నాయకుల వల్లే ప్రజారాజ్యం పరిస్థితి అలా మారిపోయిందన్నారు. ఓపిక లేని నేతల వల్లే ఒక అవకాశం చేజారిపోయిందన్నారు. పీఆర్పీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కమిటీల ఏర్పాటు విషయంలో తొందరపడడం లేదని చెప్పారు.

గతంలో పీఆర్పీలో చేరిన నేతలంతా పదవీ వ్యామోహంతో వచ్చారని… అలాంటి వారే చిరంజీవిని బలహీనంగా మార్చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎదుర్కోవాలంటే రెండు వేల కోట్లు అవసరం అవుతుందని కొందరు తనతో చెబుతున్నారని పవన్ వివరించారు.

మరో పది రోజుల్లో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు వేస్తామని… ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. రాజకీయాల్లో ఎదగాలంటే 25 ఏళ్లు ఓపిక పట్టాలన్నారు. రాత్రికి రాత్రి రాజకీయాల్లో ఎదిగిపోవడం సాధ్యం కాదన్నారు. భావజాలం లేని పార్టీలు రాజ్యాలేలుతున్నాయని పవన్ విమర్శించారు. రాజకీయం వ్యాపారంగా మారితే సేవాభావం క్షీణించి పోతుందన్నారు.

Tags:    
Advertisement

Similar News