బ‌ర్డ్ బాక్స్ ఛాలెంజ్ గురించి విన్నారా?

నిల్లు ఛాలెంజ్, డెలి అల్లి ఛాలెంజ్, కికీ ఛాలెంజ్…. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో త‌మ‌ని తాము నిరూపించుకునేందుకు కొంత‌మంది ఔత్సాహికులు ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల్ని తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏదో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేయాలి. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా లైక్స్, షేర్లు, కామెంట్లు రావాలి. అంద‌రూ త‌మ గురించే చ‌ర్చించాలని అత్యాశతో ఏదో ఒక ఛాలెంజ్ తో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభం లో ”బ‌ర్డ్ బాక్స్ […]

Advertisement
Update:2019-01-04 02:42 IST

నిల్లు ఛాలెంజ్, డెలి అల్లి ఛాలెంజ్, కికీ ఛాలెంజ్…. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో త‌మ‌ని తాము నిరూపించుకునేందుకు కొంత‌మంది ఔత్సాహికులు ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల్ని తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏదో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేయాలి. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా లైక్స్, షేర్లు, కామెంట్లు రావాలి. అంద‌రూ త‌మ గురించే చ‌ర్చించాలని అత్యాశతో ఏదో ఒక ఛాలెంజ్ తో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నారు.

కొత్త ఏడాది ప్రారంభం లో ”బ‌ర్డ్ బాక్స్ అనే ఛాలెంజ్” నెట్టింట్లో షికార్లు చేస్తోంది. ఎంట‌ర్ టైన్ మెంట్ రంగానికి చెందిన నెట్ ఫ్లిక్స్ ”బ‌ర్డ్ బాక్స్” సినిమాను రూపొందించింది. అయితే ఆ సినిమాలోని ఓ సీన్ తో క‌నెక్ట్ అయిన నెటిజ‌న్లు స‌రికొత్త ఛాలెంజ్ ను తెర‌పైకి తెచ్చారు. ఈ విష‌యం ఆ నోటా ఈనోటా పాకి నెట్ ఫ్లిక్స్ కు చేరింది. దీంతో స‌ద‌రు సంస్థ ప్ర‌మాద క‌ర‌మైన గేమ్స్ ఆడొద్దంటూ హెచ్చ‌రించింది.

బ‌ర్డ్ బాక్స్ అనే సినిమాలో అడ‌విలో ఉన్న త‌న పిల్ల‌ల్ని కాపాడుకునేందుకు త‌ల్లి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ప‌క్షుల శ‌బ్ధాల ఆధారంగా పిల్లల్ని ర‌క్షించుకునేందుకు య‌త్నిస్తుంది.

ఈ సీన్ కు ఫిదా అయిన అమెరిక‌న్ లు కళ్లకు గంతలు కట్టుకుని బర్డ్ బాక్స్ గేమ్‌లు ఆడడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన నిర్మాణ సంస్థ ఇలాంటి పిచ్చిప‌నులు చేయ‌కండ‌ని సూచించింది.

Tags:    
Advertisement

Similar News