16 ఎంపీ సీట్లు గెలిచి... కేంద్రం మెడలు వంచుతాం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ…. అదే ఊపులో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి తీరాలనే కృత నిశ్చయంతో ఉంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందున్న లక్ష్యం 16 ఎంపీ సీట్లను గెలవడమే. పంచాయితీ ఎన్నికలు ఈ నెలలో ముగిసిన తర్వాత ఆయన పూర్తిగా పార్లమెంటు ఎన్నికల పైనే దృష్టి పెట్టనున్నారు. ఇటీవల ఆయన నియోజక వర్గాల్లో నిర్వహిస్తున్న సభల్లో ఒకే విషయాన్ని […]

Advertisement
Update:2019-01-03 04:27 IST

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ…. అదే ఊపులో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి తీరాలనే కృత నిశ్చయంతో ఉంది.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందున్న లక్ష్యం 16 ఎంపీ సీట్లను గెలవడమే. పంచాయితీ ఎన్నికలు ఈ నెలలో ముగిసిన తర్వాత ఆయన పూర్తిగా పార్లమెంటు ఎన్నికల పైనే దృష్టి పెట్టనున్నారు.

ఇటీవల ఆయన నియోజక వర్గాల్లో నిర్వహిస్తున్న సభల్లో ఒకే విషయాన్ని పేర్కొంటున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు కట్టబెట్టండి… కేసీఆర్ కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొని వస్తాడని పదే పదే చెబుతున్నారు.

టీఆర్ఎస్ ప్రణాళికలు, కేటీఆర్ లక్ష్యాల గురించి పీటీఐ వార్త సంస్థ ఒక ఆర్టికల్ ప్రచురించింది. దేశంలో ప్రజలకు బీజేపీపై రోజు రోజుకూ విశ్వాసం తగ్గిపోతోందని.. కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందే స్థితిలో లేదని అంటోంది.

ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఇదే స్థితిని అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి మెజార్టీ రాకపోతే ప్రాంతీయ పార్టీల సీట్లే కీలకం కానున్నాయి.

కేసీఆర్ ఈ విషయాన్ని ముందే గ్రహించారు కాబట్టే వచ్చే ఎన్నికల్లో 16 సీట్లు గెలవాలని…. అందుకే కేటీఆర్‌కు ఆ బాధ్యత అప్పగించారని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ గనుక కీలకపాత్ర పోషించినట్లైతే కేంద్రం మెడలు వంచి హైదరాబాద్, తెలంగాణ కోసం భారీ నిధులు తీసుకొని రావచ్చని కేటీఆర్ చెబుతున్నారు. మరి వీరి వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో కాలమే చెబుతుంది.

Tags:    
Advertisement

Similar News