అక్టోబర్ 18నే జగన్‌ హత్యకు ప్లాన్

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి విశాఖ సీపీ మహేష్ లడ్డా కీలక విషయాలు వెల్లడించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లడ్డా.. పథకం ప్రకారమే జగన్‌పై దాడి జరిగిందని చెప్పారు. 2017లోనే జగన్‌ ఫ్లెక్సీని నిందితుడు శ్రీనివాస్ తయారు చేయించాడని మహేష్ లడ్డా చెప్పారు. అక్టోబర్‌ 18నే జగన్‌ హత్యకు శ్రీనివాస్‌ ప్లాన్ చేశాడని వివరించారు. కానీ జగన్‌ అక్టోబర్ 17నే హైదరాబాద్‌ వెళ్లిపోవడంతో హత్యాయత్నం వాయిదా పడిందన్నారు. దాడి చేసిన కత్తికి రెండుసార్లు పదును […]

Advertisement
Update:2019-01-02 10:18 IST

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి విశాఖ సీపీ మహేష్ లడ్డా కీలక విషయాలు వెల్లడించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లడ్డా.. పథకం ప్రకారమే జగన్‌పై దాడి జరిగిందని చెప్పారు. 2017లోనే జగన్‌ ఫ్లెక్సీని నిందితుడు శ్రీనివాస్ తయారు చేయించాడని మహేష్ లడ్డా చెప్పారు.

అక్టోబర్‌ 18నే జగన్‌ హత్యకు శ్రీనివాస్‌ ప్లాన్ చేశాడని వివరించారు. కానీ జగన్‌ అక్టోబర్ 17నే హైదరాబాద్‌ వెళ్లిపోవడంతో హత్యాయత్నం వాయిదా పడిందన్నారు. దాడి చేసిన కత్తికి రెండుసార్లు పదును పెట్టినట్టు విచారణలో తేలిందన్నారు. దాడికి కొన్ని గంటల ముందు కూడా కత్తికి రెస్టారెంట్‌లోనే పదును పెట్టడంతో పాటు వేడి నీటితో స్టెరిలైజ్‌ చేశాడని విచారణలో తేలిందన్నారు. దీన్ని బట్టి జగన్‌పై విష ప్రయోగం చేసే ఉద్దేశం నిందితుడికి లేదని స్పష్టమవుతోందన్నారు.

విజయదుర్గతో ముందుగానే శ్రీనివాస్ లేఖ రాయించుకున్నాడని…. ఆ లేఖను విజయదుర్గ జిరాక్స్ కూడా చేయించి పెట్టిందని లడ్డా వివరించారు. దాడి చేసిన రోజు తెల్లవారుజామున 4.55 గంటలకే శ్రీనివాస్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడని…. ఉదయం తొమ్మిది గంటల నుంచే శ్రీనివాస్‌… జగన్‌ కోసం రెస్టారెంట్‌లో కాచుకుని కూర్చున్నాడని వెల్లడించారు.

తనను టీవీల్లో చూస్తారని శ్రీనివాస్‌ తనతో పాటు పనిచేసే హేమలత, అమ్మాజీలకు ముందు రోజే చెప్పాడని సీపీ వివరించారు. ఇకపై తనను కలవాలంటే ఎంపీ, ఎమ్మెల్యేల తరహాలో అపాయింట్‌ మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు.

కేసును ఎన్ఐఏకు అప్పగించే అంశంపైనా లడ్డా స్పందించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంటుందని అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకునే దాడి కేసు వివరాలను ఆరోజు వెంటనే మీడియా ముందుకు వచ్చి తెలియజేయాల్సి వచ్చిందన్నారు. తాము ఆదేశించే వరకు చార్జిషీట్‌ దాఖలు చేయవద్దని హైకోర్టు చెప్పిందని… అందుకే ఇప్పటి వరకు దాడి కేసులో చార్జిషీట్ వేయలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News