నేను ఎంత మొత్తుకున్నా... వాళ్లు వినలేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు నోరువిప్పారు టీజేఎస్ అధినేత కోదండరాం. ఫలితాలు వెలువడ్డాక… ఎన్నికలపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేసుకుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే తమ పార్టీ ఓడిపోయిందని నేతలు చెప్పుకున్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కోదండరాం బహిరంగంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు తెలంగాణ ఎన్నికలపై స్పందించారు కోదండరాం. మహాకూటమి ఎందుకు ఓడిపోయిందో…. వివరించారు. ప్రచారం విషయంలో సాగతీతే ఓటమికి కారణమన్నారు. తాను మొత్తుకున్నా ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు తన మాట వినలేదని […]

Advertisement
Update:2019-01-02 03:18 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు నోరువిప్పారు టీజేఎస్ అధినేత కోదండరాం. ఫలితాలు వెలువడ్డాక… ఎన్నికలపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేసుకుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే తమ పార్టీ ఓడిపోయిందని నేతలు చెప్పుకున్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కోదండరాం బహిరంగంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు తెలంగాణ ఎన్నికలపై స్పందించారు కోదండరాం.

మహాకూటమి ఎందుకు ఓడిపోయిందో…. వివరించారు. ప్రచారం విషయంలో సాగతీతే ఓటమికి కారణమన్నారు. తాను మొత్తుకున్నా ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు తన మాట వినలేదని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ప్రచార శైలి గురించి తనకు తెలుసునని…. కేసీఆర్ ప్రచార శైలి మీకు తెలియదని… కాంగ్రెస్, టీడీపీ నేతలకు వివరించినా … వాళ్లు పట్టించుకోలేదని కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రచారానికి పదిహేను రోజులు చాలని ఉత్తమ్ అన్నారని…టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కేవలం మూడు వారాలు సరిపోతాయని అన్నారని కోదండరాం అన్నారు. అంతేకాదు ఎన్నికల ప్రక్రియలో అధికారుల తప్పిదాలు కూడా తమ ఓటమికి కారణం అని చెప్పారు.

ఇక ఈవీఎంలే ఓటమికి కారణమని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. దీంతో కోదండరాం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చినట్లయింది. ఈవీఎంల వల్లే ఓడిపోయామనడం సరికాదని కోదండరాం అనడం కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టిసేంది.

చంద్రబాబుకు, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై కోదండరాం స్పందించారు. వారి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో….ఎలాంటి గిఫ్ట్ లు ఇచ్చుకుంటారో వేచిచూడాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదన్న కోదండరాం…. మూడో కూటమి కట్టడానికి దేశంలో ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. తమ ఓటమిపై త్వరలో మహాకూటమిలోని పార్టీలతో సమావేశం నిర్వహించి… వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై సమాలోచనలు చేస్తామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News