టీ-పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల... తేదీలు, ఖర్చు పరిమితులు ఇవే...

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మూడు విడతల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12వేల 732 గ్రామ పంచాయతీలు, లక్షా 13, 170 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జనవరి 21న, జనవరి 25న రెండో విడత, మూడో విడత ఎన్నికల పోలింగ్‌ జనవరి 30న జరగనుంది. జనవరి 30 వ తేదీ పోలింగ్ […]

Advertisement
Update:2019-01-01 15:46 IST

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మూడు విడతల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

12వేల 732 గ్రామ పంచాయతీలు, లక్షా 13, 170 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జనవరి 21న, జనవరి 25న రెండో విడత, మూడో విడత ఎన్నికల పోలింగ్‌ జనవరి 30న జరగనుంది. జనవరి 30 వ తేదీ పోలింగ్ ముగియగానే కౌంటింగ్ మొదలుపెట్టి ఆరోజే ఫలితాలు వెల్లడిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది.

ఫలితాల రోజే వార్డు మెంబర్లు చేతులెత్తే పద్దతిలో ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. మొదటి విడతలో 4,480 పంచాయతీలకు, రెండో విడతలలో 4,137 పంచాయతీలకు, మూడో విడతలో 3,115 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని నాగిరెడ్డి ప్రకటించారు.

సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు డిపాజిట్‌ కింద రూ.2,000 చెల్లించాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వార్డుకు పోటీ చేయాలంటే జనరల్ అభ్యర్థులు ఐదు వందలు, రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి.

సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు 5వేల జనాభా దాటిన గ్రామాల్లో 2.5 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. 5వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు లక్షన్నరకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు.

వార్డు మెంబర్లు పెద్ద పంచాయతీల్లో 50వేలకు మించి ఖర్చు చేయరాదు.. చిన్న గ్రామాల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసే వారు 30వేల రూపాయలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు.

Advertisement

Similar News