జగన్‌ను కలిసిన గుర్నాథ రెడ్డి....

అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. టీడీపీ నుంచి తిరిగి వైసీపీలో చేరారు. జేసీ దివాకర్‌ రెడ్డి ఒత్తిడితో టీడీపీలో చేరిన గుర్నాథరెడ్డి అక్కడ తనకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆదివారం టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిశారు. పార్టీ కండువా కప్పి గుర్నాథరెడ్డిని జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరి తప్పు చేశానని గుర్నాథరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి […]

Advertisement
Update:2018-12-31 07:25 IST

అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. టీడీపీ నుంచి తిరిగి వైసీపీలో చేరారు. జేసీ దివాకర్‌ రెడ్డి ఒత్తిడితో టీడీపీలో చేరిన గుర్నాథరెడ్డి అక్కడ తనకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆదివారం టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిశారు. పార్టీ కండువా కప్పి గుర్నాథరెడ్డిని జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరి తప్పు చేశానని గుర్నాథరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు తాను టీడీపీలో చేరాను తప్ప…. తన స్వప్రయోజనాలు, పదవులను ఆశించి పోలేదని ఆయన వివరణ ఇచ్చారు.

గుర్నాథరెడ్డి కుటుంబం, వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేది. కానీ టికెట్ విషయంలో తేడా రావడం, జేసీ దివాకర్ రెడ్డి ఒత్తిడి తేవడంతో గుర్నాథరెడ్డి టీడీపీలో చేరిపోయారు. కానీ అక్కడ ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదు.

Tags:    
Advertisement

Similar News