తన ఓటు ఎవరికో చెప్పిన నాగబాబు, బండ్ల బ్లేడు చాలెంజ్‌పై ఫన్నీ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ చేసిన హడావుడి అందరినీ ఆకట్టుకుంది. బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలను ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు. కాంగ్రెస్‌ ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని చేసిన చాలెంజ్‌ను పట్టుకుని కొందరు మీడియా ప్రతినిధులు ఓవర్‌గా రియాక్ట్‌ అయి… బండ్ల గణేష్ ఇంటి వద్దకు బ్లేడు తీసుకుని వెళ్లి రిపోర్టింగ్ చేయడం ద్వారా పోటీగా వినోదాన్ని పంచారు. ఈ ఎపిసోడ్‌పై నటుడు నాగబాబు స్పందించారు. ఒక చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన […]

Advertisement
Update: 2018-12-30 08:31 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ చేసిన హడావుడి అందరినీ ఆకట్టుకుంది. బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలను ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు.

కాంగ్రెస్‌ ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని చేసిన చాలెంజ్‌ను పట్టుకుని కొందరు మీడియా ప్రతినిధులు ఓవర్‌గా రియాక్ట్‌ అయి… బండ్ల గణేష్ ఇంటి వద్దకు బ్లేడు తీసుకుని వెళ్లి రిపోర్టింగ్ చేయడం ద్వారా పోటీగా వినోదాన్ని పంచారు.

ఈ ఎపిసోడ్‌పై నటుడు నాగబాబు స్పందించారు. ఒక చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… బండ్ల గణేష్‌ వ్యాఖ్యలు తనకు చాలా వినోదాన్ని పంచేవని చెప్పారు. ఎన్నికల తర్వాత తిరిగి టీఆర్‌ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను ముందే చెప్పానన్నారు.

తాను, తన కుటుంబసభ్యులు కూడా టీఆర్ఎస్‌కే ఓటేశామని నాగబాబు చెప్పారు. బండ్ల గణేష్ ఇంటర్వ్యూలు చాలా హాస్యాన్ని సృష్టించేవని వ్యాఖ్యానించారు. బండ్ల గణేష్ అనే వాడికి గొంతు కోసుకునే సీన్ లేదని తమకు ముందే తెలుసన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ ఓడిపోతే… ”ఎన్నికలన్నాక వందంటామండి” అని తప్పించుకుంటాడని ముందే ఊహించామన్నారు.

బండ్ల గణేష్ ఇంటర్వ్యూల్లో చేసే హాస్యం సినిమాల్లో గానీ చేసుంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యే వాడని నాగబాబు అభిప్రాయపడ్డారు. కానీ సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్‌లో హాస్యాన్ని చూపిస్తున్నాడని నాగబాబు కామెంట్ చేశాడు.

రేవంత్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతల ఆవేశపూరిత ప్రసంగాలు చూసి ఆవేశంతో ఉన్న తమకు బండ్ల గణేష్ స్పీచ్‌లు కామెడీని పంచేవన్నారు.

Tags:    
Advertisement

Similar News