జగన్‌ను కలిసిన అలీ.... అనుచిత వ్యాఖ్యల వివాదం

పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఇటీవల పలువురు సినీ నటులు కలిసి మద్దతు తెలుపుతున్నారు. పోసాని, పృధ్వీ, బానుచందర్‌, చోటా కే నాయుడు, కృష్ణుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు జగన్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. శుక్రవారం నాడు ప్రముఖ నటుడు అలీ కూడా జగన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఎయిర్ పోర్టులో కాసేపు చర్చించారు. ఈ నేపథ్యంలో అలీపై కొందరు జనసేన కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ […]

Advertisement
Update:2018-12-30 05:07 IST

పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఇటీవల పలువురు సినీ నటులు కలిసి మద్దతు తెలుపుతున్నారు. పోసాని, పృధ్వీ, బానుచందర్‌, చోటా కే నాయుడు, కృష్ణుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు జగన్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

శుక్రవారం నాడు ప్రముఖ నటుడు అలీ కూడా జగన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఎయిర్ పోర్టులో కాసేపు చర్చించారు. ఈ నేపథ్యంలో అలీపై కొందరు జనసేన కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

జగన్‌తో అలీ ఉన్న ఫొటోను ఉంచి… అలీ మతాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారు. ఈ పోస్టు బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తల తీరును ”అలీ సేవా సమితి” ఖండించింది.

అలీని అవమానించడంతో పాటు ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన జనసేన కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అలీ సేవా సమితి అధ్యక్షుడు షేక్ మస్తాన్‌ వలి, ప్రధాన కార్యదర్శి రమేష్‌ నాయుడు తెలిపారు.

అలీ లాంటి ఒక మంచి మనిషిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జనసేన కార్యకర్తలకు తగదన్నారు. ఒక ప్రతిపక్ష నేతను అలీ కలిస్తే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని జనసేన నాయకత్వం కట్టడి చేయాలని అలీ సేవా సమితి విజ్ఞప్తి చేసింది.

Tags:    
Advertisement

Similar News