ఇంత చేతగాని సీఎంను ఎన్నడూ చూడలేదని న్యాయమూర్తులే అంటున్నారు...
అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబే స్వయంగా హైకోర్టుకు లేఖ రాశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు గుర్తు చేశారు. ఆగస్టులోపు ఏపీలో హైకోర్టు భవనాలను సిద్దం చేస్తామని…. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా డిసెంబర్ 15 నాటికి భవనాలన్నీ సిద్ధంగా ఉంటాయని అఫిడవిట్ రూపంలో తెలియజేశారన్నారు. సామాన్య ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టుగానే చివరకు న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కూడా చంద్రబాబు తప్పుదోవ పట్టించారన్నారు. కోర్టులకంటూ ఓ స్టేచర్ ఉంటుందని…. చంద్రబాబు […]
అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబే స్వయంగా హైకోర్టుకు లేఖ రాశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు గుర్తు చేశారు. ఆగస్టులోపు ఏపీలో హైకోర్టు భవనాలను సిద్దం చేస్తామని…. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు.
ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా డిసెంబర్ 15 నాటికి భవనాలన్నీ సిద్ధంగా ఉంటాయని అఫిడవిట్ రూపంలో తెలియజేశారన్నారు. సామాన్య ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టుగానే చివరకు న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కూడా చంద్రబాబు తప్పుదోవ పట్టించారన్నారు.
కోర్టులకంటూ ఓ స్టేచర్ ఉంటుందని…. చంద్రబాబు మాత్రం సీఎం క్యాంపు ఆఫీసులో పెడతా, రైస్ మిల్‌లో పెడతా, కోళ్ల ఫాంలో పెడతా అన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్ నగరాన్ని నిర్మించాను… అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను అని చెప్పే చంద్రబాబు ఇన్నేళ్లలో ఒక హైకోర్టు భవనాన్ని ఎందుకు కట్టలేకపోయారని… ఇది చంద్రబాబు చేతగాని తనం కాదా అని ప్రశ్నించారు.
అమరావతిలో పరిస్థితులు సరిగా లేవని న్యాయమూర్తులు, న్యాయవాదులు వాపోతున్నారని జీవీఎల్ చెప్పారు. ఇంత చేతగాని సీఎంను చరిత్రలో ఎన్నడూ చూడలేదని వారంతా ఆవేదన చెందుతున్నారని వివరించారు.
చంద్రబాబు వెంటనే న్యాయమూర్తులకు, న్యాయ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 15లోగా భవనాలు సిద్ధం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం అఫిడవిట్ వేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.