జీహెచ్‌ఎంసీ భవనంలో దయ్యాల తరహాలో దొంగతనాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు చూసి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. నెల రోజులుగా వరుసగా జీహెచ్‌ఎంసీ భవనంలో వస్తువులు మాయమవుతున్నాయి. కానీ దొంగలను గుర్తించలేక పోతున్నారు. మొబైల్‌ ఫోన్లు, జర్కిన్ లు, ఇయర్‌ ఫోన్లు, ఫోన్ చార్జర్స్‌ను వరుసగా ఎత్తుకెళ్తున్నారు. అందరూ ఉండే చోటే ఇలా వస్తువులు మాయమవడం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిల్లర దొంగలు టీవీ రిమోట్లను కూడా మాయం చేస్తుండడం విశేషం. ఇలా వరుసగా తమ వస్తువులు […]

Advertisement
Update:2018-12-29 09:51 IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు చూసి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. నెల రోజులుగా వరుసగా జీహెచ్‌ఎంసీ భవనంలో వస్తువులు మాయమవుతున్నాయి. కానీ దొంగలను గుర్తించలేక పోతున్నారు.

మొబైల్‌ ఫోన్లు, జర్కిన్ లు, ఇయర్‌ ఫోన్లు, ఫోన్ చార్జర్స్‌ను వరుసగా ఎత్తుకెళ్తున్నారు. అందరూ ఉండే చోటే ఇలా వస్తువులు మాయమవడం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిల్లర దొంగలు టీవీ రిమోట్లను కూడా మాయం చేస్తుండడం విశేషం. ఇలా వరుసగా తమ వస్తువులు మాయమవుతున్నాయని ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తుండడంతో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు. వెంటనే కార్యాలయం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ భవనంలో 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పనిచేయడం లేదు. పనిచేస్తున్న కెమెరాలకు కూడా దొంగలు దొరకడం లేదు.

దొంగతనాలు జరుగుతున్న తీరు తమకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ దొంగతనాలు దయ్యాలు చేస్తున్నాయా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

టీవీ రిమోట్లు, కీబోర్డులు, మౌస్‌లు కూడా మాయమవుతున్నాయని…దీన్ని బట్టి దొంగల ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సుధీర్ అనే ఉద్యోగి తన చైర్‌ మీద జర్కిన్‌ను ఉంచి అలా వెళ్లి వచ్చే సరికి అది మాయమైపోయిందట.

ఇలా అధికారుల నుంచి సిబ్బంది వరకు…. దొంగలకు భయపడి ఎక్కడికి వెళ్లినా తమ ఫోన్ చార్జర్లను కూడా జేబులో పెట్టుకుని వెళ్తున్నారట.

Tags:    
Advertisement

Similar News