బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా జోరు
విజయానికి 2 వికెట్ల దూరంలో టీమిండియా కంగారూలను ఆదుకోని కమ్మిన్స్ ఆల్ రౌండ్ షో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 258 పరుగుల స్కోరుతో ఎదురీత బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయానికి ఉరకలేస్తోంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే ఎనిమిది కంగారూ వికెట్లు పడగొట్టి….విజయానికి 2 వికెట్ల దూరంలో నిలిచింది. 399 పరుగుల టార్గెట్ తో.. చేజింగ్ కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా…నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 258 పరుగుల స్కోరుతో నిలిచింది. కమ్మిన్స్ […]
- విజయానికి 2 వికెట్ల దూరంలో టీమిండియా
- కంగారూలను ఆదుకోని కమ్మిన్స్ ఆల్ రౌండ్ షో
- ఆస్ట్రేలియా 8 వికెట్లకు 258 పరుగుల స్కోరుతో ఎదురీత
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయానికి ఉరకలేస్తోంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే ఎనిమిది కంగారూ వికెట్లు పడగొట్టి….విజయానికి 2 వికెట్ల దూరంలో నిలిచింది.
399 పరుగుల టార్గెట్ తో.. చేజింగ్ కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా…నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 258 పరుగుల స్కోరుతో నిలిచింది.
కమ్మిన్స్ ఒంటరిపోరాటం….
టాపార్డర్ లో ఉస్మాన్ క్వాజా 33, షాన్ మార్ష్ 44, ట్రావిస్ హెడ్ 34 పరుగులు స్కోర్లు సాధించగా…లోయర్ ఆర్డర్ ఆటగాడు యాండీ కమ్మిన్స్ 61 పరుగుల నాటౌట్ స్కోరుతో పోరాడుతున్నాడు.
టెయిల్ ఎండర్ నేథన్ లయన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ చెరో రెండు వికెట్లు, స్పిన్నర్ జడేజా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ నెగ్గాలంటే చివరి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఇంకా 141 పరుగులు సాధించాల్సి ఉంది. టీమిండియా విజేతగా నిలవాలంటే రెండు వికెట్లు పడగొడితే చాలు.
ఈ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో ఏదైనా అద్భుతం జరిగితే మినహా… ఆస్ట్రేలియాకు ఓటమి తప్పదు.
399 పరుగుల టార్గెట్ తో డిక్లేర్….
బాక్సింగ్ డే టెస్టులో ఓవైపు టీమిండియా విజయానికి ఉరకలేస్తుంటే….ఆతిథ్య ఆస్ట్రేలియా తరపున ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ ఒంటరిపోరాటం చేస్తున్నాడు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కమ్మిన్స్ చెలరేగిపోయాడు. ఏకంగా 27 పరుగులకే 6 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఓపెనర్లు విహారీ, మయాంక్ అగర్వాల్, వన్ డౌన్ పూజారా, రెండో డౌన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లను..కమ్మిన్స్ …పెవీలియన్ దారి పట్టించాడు. టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వార్ రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
మూడోసారి కమ్మిన్స్….
టెస్ట్ క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం కమ్మిన్స్ కెరియర్ లో ఇది మూడోసారి మాత్రమే. అంతేకాదు…తమజట్టు రెండో ఇన్నింగ్స్ లో…కమ్మిన్స్ 61 పరుగుల నాటౌట్ స్కోరుతో టీమిండియా బౌలర్లతో పాటు విజయాన్ని సైతం…నాలుగోరోజు వరకూ నిలువరించగలిగాడు.
కమ్మిన్స్ మొత్తం 103 బాల్స్ ఎదుర్కొని ఓ సిక్సర్, 5 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తన కెరియర్ లో కేవలం 17వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న కమ్మిన్స్ కు ఇది కేవలం రెండో హాఫ్ సెంచరీ మాత్రమే.