బాక్సింగ్ డే టెస్ట్ లో బుమ్రా బ్యాంగ్ బ్యాంగ్

మూడోరోజున బుమ్రా విశ్వరూపం 33 పరుగులకే 6 వికెట్లతో బుమ్రా క్యాలెండర్ ఇయర్ లో 45 వికెట్లతో బుమ్రా రికార్డు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాజట్లపై 5 వికెట్ల మొనగాడు బుమ్రా బాక్సింగ్ డే టెస్ట్ మూడోరోజు ఆటలో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఆతిథ్య కంగారూ జట్టును 151 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు. బుమ్రా 15.5 ఓవర్లలో 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ హారిస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, […]

Advertisement
Update:2018-12-28 09:13 IST
  • మూడోరోజున బుమ్రా విశ్వరూపం
  • 33 పరుగులకే 6 వికెట్లతో బుమ్రా
  • క్యాలెండర్ ఇయర్ లో 45 వికెట్లతో బుమ్రా రికార్డు
  • సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాజట్లపై 5 వికెట్ల మొనగాడు బుమ్రా

బాక్సింగ్ డే టెస్ట్ మూడోరోజు ఆటలో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఆతిథ్య కంగారూ జట్టును 151 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు. బుమ్రా 15.5 ఓవర్లలో 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

ఓపెనర్ హారిస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, టిమ్ పెయిన్, జోష్ హేజిల్ వుడ్, నేథన్ లయన్… బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యారు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.

సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వేదికలుగా జరిగిన టెస్టు సిరీస్ ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు.

2018 జనవరిలో జోహెన్స్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన టెస్టులో 54 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన బుమ్రా…ప్రస్తుత బాక్సింగ్ డే టెస్టులో 33 పరుగులకే 6 వికెట్ల ఘనత సాధించాడు.

1979లో లెఫ్టామ్ స్పిన్నర్ దిలీప్ జోషీ సాధించిన 40 వికెట్ల రికార్డును బుమ్రా 45 వికెట్ల రికార్డుతో తెరమరుగు చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత బౌలర్ గా బుమ్రా తనకుతానే సాటిగా నిలిచాడు.

గతంలో …ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్ 37, నరేంద్ర హీర్వానీ 36, శ్రీశాంత్ 35 వికెట్లు సాధించి… టాప్ ఫైవ్ బౌలర్లలో చోటు సంపాదించారు.

Tags:    
Advertisement

Similar News