బాక్సింగ్ డే టెస్ట్ పై టీమిండియా పట్టు
మూడోరోజు ఆటలో వికెట్లు టపటపా ఆసీస్ 151 ఆలౌట్, టీమిండియా 5 వికెట్లకు 54 పరుగులు 346 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్ …. మూడోరోజుకే రసపట్టుగా మారింది. ఆతిథ్య ఆస్ట్రేలియా పై టీమిండియా పట్టు బిగించింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి 346 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో విజయానికి మార్గం సుగమం చేసుకొంది. తొలి ఇన్నింగ్స్ లో 443 పరుగుల భారీస్కోరు సాధించిన టీమిండియా… కంగారూలను తొలి ఇన్నింగ్స్ లో 151 […]
- మూడోరోజు ఆటలో వికెట్లు టపటపా
- ఆసీస్ 151 ఆలౌట్, టీమిండియా 5 వికెట్లకు 54 పరుగులు
- 346 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో టీమిండియా
బాక్సింగ్ డే టెస్ట్ …. మూడోరోజుకే రసపట్టుగా మారింది. ఆతిథ్య ఆస్ట్రేలియా పై టీమిండియా పట్టు బిగించింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి 346 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో విజయానికి మార్గం సుగమం చేసుకొంది.
తొలి ఇన్నింగ్స్ లో 443 పరుగుల భారీస్కోరు సాధించిన టీమిండియా… కంగారూలను తొలి ఇన్నింగ్స్ లో 151 పరుగులకే కుప్పకూల్చి… 292 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా 33 పరుగులకే 6 వికెట్లు పడగొట్టాడు.
భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా సైతం ఆస్ట్రేలియా బౌలర్ల ప్రతాపం చవిచూడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్ హీరోలు పూజారా, కొహ్లీ డకౌట్లు కాగా… రహానే 1, రోహిత్ శర్మ 5 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 28, మిడిలార్డర్ ఆటగాడు రిషభ్ పంత్ 6 పరుగుల నాటౌట్ స్కోర్లతో ఉన్నారు. టీమిండియా 5 వికెట్లకు 54 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కంగారూ బౌలర్లలో కమ్మిన్స్ 4, హేజిల్ వుడ్ 1 వికెట్ పడగొట్టారు. టీమిండియా తన ఆధిక్యాన్ని 350 నుంచి 400కు పెంచుకోగలిగితే… ఆస్ట్రేలియాకు ఓటమి తప్పదు.