ఆదాయం లేక కాదు.... వలసలు వెళ్లడం రాయలసీమ వాళ్లకు అలవాటు....

ఏపీని రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న చంద్రబాబు… బుధవారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఈసందర్భంగా వ్యవసాయ పరిస్థితులను వివరించారు. ఈ నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయం 97 శాతం పెరిగిందన్నారు. వ్యవసాయంలో 11శాతం వృద్ధితో ఏపీ మొదటి స్థానంలో ఉందని, ఐదేళ్లు వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధించామన్నారు. వ్యవసాయం ఇంతగా వృద్ధి సాధించి ఉంటే మరి […]

Advertisement
Update:2018-12-26 10:01 IST

ఏపీని రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న చంద్రబాబు… బుధవారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఈసందర్భంగా వ్యవసాయ పరిస్థితులను వివరించారు.

ఈ నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయం 97 శాతం పెరిగిందన్నారు. వ్యవసాయంలో 11శాతం వృద్ధితో ఏపీ మొదటి స్థానంలో ఉందని, ఐదేళ్లు వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధించామన్నారు.

వ్యవసాయం ఇంతగా వృద్ధి సాధించి ఉంటే మరి రాయలసీమలో వలసలు ఎందుకు తగ్గడం లేదన్న ప్రశ్నకు స్పందించిన ముఖ్యమంత్రి…. అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా చేశామన్నారు.

ఇప్పుడు గోదావరి జిల్లా రైతుల కంటే అనంతపురం జిల్లాలో రైతుల ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం ధనికమైన ప్రాంతంగా మారుతుందన్నారు. రాయలసీమ వారికి వలస వెళ్లడం అలవాటు అని వ్యాఖ్యానించారు.

స్థానికంగా అవకాశాలు లేక కాదని… ఎక్కువ ఆదాయం వస్తుందనే రాయలసీమ ప్రజలు బెంగళూరు వలస వెళ్తారని చెప్పారు. ఇంకా ఆదాయం ఎక్కువగా ఉంటుందని మరికొందరు కేరళ వెళ్తుంటారని విశ్లేషించారు. శ్రీకాకుళం జిల్లాది కూడా అదే పరిస్థితి అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని… అయినా సరే ఏ రాష్ట్రంలో చూసినా కార్మికులుగా శ్రీకాకుళం వారే ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వీరంతా స్థానికంగా ఆదాయం లేక వలసలు వెళ్లడం లేదని.. ఎక్కువ ఆదాయం కోసం వలస వెళ్తుంటారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News