హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ జారీ.... కేటాయించబడిన జడ్జీలు వీరే
ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీలకు ఉమ్మడిగా పనిచేస్తున్న హైకోర్టును కేంద్రం విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. సుధీర్ఘ కసరత్తు తర్వాత కేంద్రం ఉమ్మడి హైకోర్టును విభజించింది. న్యాయమూర్తులు రమేష్ రంగనాథన్, ప్రవీన్ కుమార్, వెంకట శేషసాయి, దామ శేషాద్రినాయుడు, సీతారామమూర్తి, దుర్గా ప్రసాదరావు, సునీల్ చౌదరి, ఎం. సత్యనారాయణ మూర్తి, […]
ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీలకు ఉమ్మడిగా పనిచేస్తున్న హైకోర్టును కేంద్రం విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి.
తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. సుధీర్ఘ కసరత్తు తర్వాత కేంద్రం ఉమ్మడి హైకోర్టును విభజించింది.
న్యాయమూర్తులు రమేష్ రంగనాథన్, ప్రవీన్ కుమార్, వెంకట శేషసాయి, దామ శేషాద్రినాయుడు, సీతారామమూర్తి, దుర్గా ప్రసాదరావు, సునీల్ చౌదరి, ఎం. సత్యనారాయణ మూర్తి, జి. శ్యాంప్రసాద్, ఉమాదేవి, ఎన్. బాలయోగి, రజనీ, సోమయాజులు, విజయలక్ష్మి, ఎం రంగారావు, వెంకట నారాయణనును ఏపీ హైకోర్టుకు కేటాయించారు.
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, రామచందర్ రావు, ఏ. రాజశేఖర్ రెడ్డి, పి. నవీన్ రావు, కోదండరాం చౌదరి, బి. శివ శంకర్ రావు, షమీమ్ అక్తర్, పి. కేశవ రావు, అభినంద్ కుమార్ షావిలై, అమర్‌నాథ్ గౌడ్‌లను కేటాయించారు.