వజ్రాలు వలిచేశారు... కళ తప్పిన నిజాం టిఫిన్ బాక్స్
ఆఖరి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్‌కు చెందిన బంగారు టిఫిన్ బాక్స్, బంగారం గ్లాసు, సాసర్ సెప్టెంబర్‌లో దొంగ తనానికి గురయ్యాయి. అయితే పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి బంగారం టిఫిన్ బాక్స్, సాసర్ స్వాధీనం చేసుకున్నారు. తిరిగి వాటిన మ్యూజియంలో పెట్టారు. అయితే బంగారు టిఫిన్ బాక్స్ తన వైభవాన్ని కోల్పోయింది. గతంలో వజ్రాలు పొదిగి ఉండడం వల్ల మెరుస్తూ కనిపించేది. కానీ బాక్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు దాన్ని విలువ […]
ఆఖరి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్‌కు చెందిన బంగారు టిఫిన్ బాక్స్, బంగారం గ్లాసు, సాసర్ సెప్టెంబర్‌లో దొంగ తనానికి గురయ్యాయి. అయితే పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి బంగారం టిఫిన్ బాక్స్, సాసర్ స్వాధీనం చేసుకున్నారు.
తిరిగి వాటిన మ్యూజియంలో పెట్టారు. అయితే బంగారు టిఫిన్ బాక్స్ తన వైభవాన్ని కోల్పోయింది. గతంలో వజ్రాలు పొదిగి ఉండడం వల్ల మెరుస్తూ కనిపించేది. కానీ బాక్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు దాన్ని విలువ గుర్తించలేక బాక్స్‌పై పొదిగిన వజ్రాలను వలిచేశారు. అలా వజ్రాలను వేరు చేసి విడిగా అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఆ పనిచేశారు.
దొంగల నుంచి బంగారు బాక్స్‌తో పాటు వజ్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే మ్యూజియం అధికారులు వజ్రాలను తిరిగి టిఫిన్ బాక్స్‌కు అమర్చలేదు. వాటిని కూడా విడిగా మ్యూజియంలో ఉంచారు. దీంతో టిఫిన్ బాక్స్ మెరుపు లేకుండా బోసిపోయి కనిపిస్తోంది.
ఇటీవల మ్యూజియం బోర్డు కూడా సమావేశం అయింది. దొంగతనం నేపథ్యంలో మ్యూజియం భద్రతపై అదనపు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
అయితే వజ్రాలను తిరిగి టిఫిన్ బాక్స్‌పై అమర్చే విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు. పలువురు చరిత్ర కారులు వజ్రాలను తిరిగి టిఫిన్ బాక్స్‌పై అమర్చాలని సూచిస్తున్నారు. అలా చేయని పక్షంలో బంగారు బాక్స్ తన మెరుపును కోల్పోవడంతో పాటు… దొంగతనానికి గుర్తుగా ఉండిపోతుందని అభిప్రాయపడతున్నారు.