లేడీస్‌తో గోషామహల్‌ స్టేషన్‌కు వందలాది మంది పరుగు.... ఎందుకంటే....

వాట్సాప్‌లో వచ్చిన ఒక మేసేజ్‌ వాహనదారులను పరుగులు పెట్టించింది. వాట్సాప్‌లో వచ్చిన మేసేజ్‌ను నమ్మేసిన వాహనదారులు హైదరాబాద్ గోషామహల్‌ పీఎస్‌కు పరుగులు తీశారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారుల కోసం గోషామహల్ పీఎస్‌లో లోక్‌ అధాలత్ నిర్వహిస్తున్నారని వాట్సాప్ మేసేజ్‌లో ఉంది. లోక్ అదాలత్‌లో చలాన్లు చెల్లిస్తే 50 శాతం డిస్కంట్‌ ఇస్తున్నారని అందులో ఆశ పెట్టారు. ఈ అవకాశం కేవలం ఒక్కరోజే ఉంటుందని నమ్మించారు. ఈ ఫేక్‌ మేసేజ్ వాట్సాప్‌లో బాగా వైరల్ […]

Advertisement
Update:2018-12-24 11:47 IST

వాట్సాప్‌లో వచ్చిన ఒక మేసేజ్‌ వాహనదారులను పరుగులు పెట్టించింది. వాట్సాప్‌లో వచ్చిన మేసేజ్‌ను నమ్మేసిన వాహనదారులు హైదరాబాద్ గోషామహల్‌ పీఎస్‌కు పరుగులు తీశారు.

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారుల కోసం గోషామహల్ పీఎస్‌లో లోక్‌ అధాలత్ నిర్వహిస్తున్నారని వాట్సాప్ మేసేజ్‌లో ఉంది. లోక్ అదాలత్‌లో చలాన్లు చెల్లిస్తే 50 శాతం డిస్కంట్‌ ఇస్తున్నారని అందులో ఆశ పెట్టారు. ఈ అవకాశం కేవలం ఒక్కరోజే ఉంటుందని నమ్మించారు.

ఈ ఫేక్‌ మేసేజ్ వాట్సాప్‌లో బాగా వైరల్ అయింది. దీంతో వందలాది మంది వాహనదారులు పెండింగ్‌లో ఉన్న తమ చలాన్లను 50 శాతం డిస్కంట్‌లో కట్టేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. వందలాది మంది ఇలా స్టేషన్‌ వద్దకు రావడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు.

వాట్సాప్‌లో చూశాం… డిస్కంట్లో చలాన్లు కట్టించుకుంటారట కదా! అని వాహనదారులు అడిగే సరికి పోలీసులు తలపట్టుకున్నారు. అలాంటిది ఏమీ లేదని… వాట్సాప్‌లో వచ్చింది ఫేక్‌ మేసేజ్ అని పోలీసులు వచ్చిన వారందరికీ వివరించారు.

వాహనదారులు వస్తూనే ఉండడంతో చివరకు చేసేది లేక … నోటీస్ అతికించారు. జనం ఎక్కువగా ఉంటారని భావించిన కొందరు వ్యక్తులు ఏకంగా తమ ఇంట్లోని ఆడవాళ్లను తీసుకొచ్చారు. ఆడవాళ్ల క్యూలైన్‌ రద్దీ తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో…. పలువురు ఆడవాళ్లను కూడా తీసుకొచ్చారని గండిపేటకు చెందిన అనిష్‌ అనే యువకుడు వివరించారు.

ఫేక్‌ న్యూస్‌ను నమ్మేసి…. ఉన్న పనులు మానుకుని వచ్చామని వాపోయారు. పోలీసులు మాత్రం వాట్సాప్‌లో వచ్చే మేసేజ్‌లను గుడ్డిగా నమ్మకుండా… వాటిని ఒకసారి అధికారిక వెబ్‌సైట్లలో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News