నేటినుంచే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సీజన్ హంగామా

మూడువారాలు… తొమ్మిది నగరాలలో తొమ్మిదిజట్ల సమరం 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో లీగ్ పోటీలు బరిలో సైనా, సింధు, మారిన్ తో సహా 8 మంది టాప్ ర్యాంకర్లు డిసెంబర్ 25 నుంచి 28 వరకూ హైదరాబాద్ అంచె పోటీలు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సీజన్ పోటీలకు…ముంబై వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.  మరికొద్ది గంటల్లో జరిగే ఈ పోటీలలో మొత్తం తొమ్మిది ఫ్రాంచైజీల జట్లు ఢీ కొంటున్నాయి. 9 నగరాలలో హంగామా… డిసెంబర్ 22 […]

Advertisement
Update:2018-12-22 08:55 IST
  • మూడువారాలు… తొమ్మిది నగరాలలో తొమ్మిదిజట్ల సమరం
  • 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో లీగ్ పోటీలు
  • బరిలో సైనా, సింధు, మారిన్ తో సహా 8 మంది టాప్ ర్యాంకర్లు
  • డిసెంబర్ 25 నుంచి 28 వరకూ హైదరాబాద్ అంచె పోటీలు

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సీజన్ పోటీలకు…ముంబై వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఈ పోటీలలో మొత్తం తొమ్మిది ఫ్రాంచైజీల జట్లు ఢీ కొంటున్నాయి.

9 నగరాలలో హంగామా…

డిసెంబర్ 22 నుంచి జనవరి 13 వరకూ జరిగే ఈ పోటీలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్,గౌహతీ, పూణే నగరాలు వేదికలుగా నిర్వహించనున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్

మొదటి పది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లలో ఎనిమిదిమంది ఈ లీగ్ లో వివిధ జట్ల తరపున ఢీ కొంటున్నారు. మొత్తం 17 దేశాలకు చెందిన 90మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గోనున్నారు. ఇందులో 45మంది భారత క్రీడాకారులే కావడం విశేషం.

6 కోట్ల ప్రైజ్ మనీ…

మొత్తం 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ లీగ్ లో విజేతగా నిలిచిన జట్టుకు 3 కోట్ల రూపాయలు, రన్నరప్ జట్టుకు కోటీ 50 లక్షల రూపాయలు.. ఇస్తారు. ఇక…హైదరాబాద్ అంచె పోటీలు డిసెంబర్ 25 నుంచి 28 వరకూ జరుగనున్నాయి.

25 నుంచి హైదరాబాద్ లెగ్ పోటీలు….

డిసెంబర్ 25న హైదరాబాద్ తో చెన్నై, 26 న ఢిల్లీ తో అహ్మదాబాద్, 27న నార్త్ ఈస్టర్న్ తో ముంబై, 28 న అహ్మదాబాద్ తో బెంగళూరు, హైదరాబాద్ తో ఆవధి జట్లు ఢీ కొంటాయి.

లీగ్ లో తలపడుతున్న జట్లలో హైదరాబాద్ హంటర్స్, ముంబై రాకెట్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్, పూణే సెవెన్ ఏసెస్, చెన్నై స్మాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, అవధే వారియర్స్, బెంగళూరు ర్యాప్టర్స్, ఢిల్లీ డాషర్స్ ఉన్నాయి. జనవరి 13న బెంగళూరు వేదికగా జరిగే ఫైనల్స్ తో నాలుగో సీజన్ కు తెరపడనుంది.

Tags:    
Advertisement

Similar News