వెన్నుపోటు పాట రివ్యూ.... సినిమా ఎలా ఉంటుందో వర్మ హింట్

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి అనుకున్నంత పనిచేశారు. బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌ ఆడియో లాంచ్‌కు పోటీగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాటను వర్మ విడుదల చేశారు. ఈ పాటలో వర్మ నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేశారు. నేరుగా చంద్రబాబు దృశ్యాలనే చూపిస్తూ ఆయన్ను పాటలో విలన్‌గా చూపించారు వర్మ. సినిమాలో ఆర్టిస్టులను చూపించకుండా కేవలం చంద్రబాబు, ఎన్టీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల యధార్థ దృశ్యాలు, ఫోటోలను ఈ పాటలో చూపించారు. ”దగా దగా…మోసం” అంటూ పాట […]

Advertisement
Update:2018-12-21 11:16 IST

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి అనుకున్నంత పనిచేశారు. బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌ ఆడియో లాంచ్‌కు పోటీగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాటను వర్మ విడుదల చేశారు. ఈ పాటలో వర్మ నేరుగా
చంద్రబాబునే టార్గెట్ చేశారు. నేరుగా చంద్రబాబు దృశ్యాలనే చూపిస్తూ ఆయన్ను పాటలో విలన్‌గా చూపించారు వర్మ.

సినిమాలో ఆర్టిస్టులను చూపించకుండా కేవలం చంద్రబాబు, ఎన్టీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల యధార్థ దృశ్యాలు, ఫోటోలను ఈ పాటలో చూపించారు. ”దగా దగా…మోసం” అంటూ పాట మొదలైంది. ”పొంచి పొంచి పగడలే ఎత్తి వీళ్లు కుటిల నీతి
విషమునే చిమ్మినారు… దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్లు కలియుగాన శకునులే అయ్యినారు” అంటూ చంద్రబాబును ఉద్దేశించి పాట రాశారు.

వెన్నుపోటు ఘట్టమే ప్రధానంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చంద్రబాబు క్యారెక్టర్‌ను నెగిటివ్‌గా చూపే ధైర్యం వర్మకు ఉందా? అన్న ప్రశ్నలకు ఈ పాట ద్వారానే ఆర్‌జీవీ సమాధానం చెప్పారు. పాటలో ఒక సందర్భంలో చంద్రబాబును
చూపిస్తూనే ఆయన్ను ”గోతి కాడ నక్క” అని అభివర్ణించారు. ”న్యాయమనే కోటను తగులబెట్టి నీతికి గొయ్యి తీసి పాతిపెట్టారు” అని పాటలో ఉంది.

పాట మొత్తం చంద్రబాబును విలన్‌గా చూపే దృశ్యాలు, ఫొటోలనే వర్మ జాగ్రత్తగా ఎంచుకుని వాడినట్టు అనిపిస్తోంది. చంద్రబాబును విలన్‌గా అభివర్ణిస్తూ ఇంత ధైర్యంగా పాటను విడుదల చేసిన వర్మ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News