విశాఖ హోటల్స్‌లో దారుణాలు... రోజుల తరబడి ఫ్రిజ్ లో ఉంచి....
విశాఖలోని హోటల్స్‌లో దారుణాలు వెలుగు చూశాయి. వినియోగదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో పలు హోటళ్లపై విజిలెన్స్ తో పాటు ఫుడ్ క్వాలిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతికలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ బీచ్ రోడ్డులోని మత్స్యదర్శని వద్ద ఉన్న ఒక హోటల్‌లో నాణ్యత లేని ఆహారం కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పక్కనే ఉన్న మరో రెస్టారెంట్లోనూ ఇదే పరిస్థితి. నగరంలోని కొన్ని హోటల్స్‌లో పాడై పోయిన ఆహార […]
విశాఖలోని హోటల్స్‌లో దారుణాలు వెలుగు చూశాయి. వినియోగదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో పలు హోటళ్లపై విజిలెన్స్ తో పాటు ఫుడ్ క్వాలిటీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతికలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ బీచ్ రోడ్డులోని మత్స్యదర్శని వద్ద ఉన్న ఒక హోటల్‌లో నాణ్యత లేని ఆహారం కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పక్కనే ఉన్న మరో రెస్టారెంట్లోనూ
ఇదే పరిస్థితి.
నగరంలోని కొన్ని హోటల్స్‌లో పాడై పోయిన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారని ఇటీవల అధికారులకు వరుసగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈనేపథ్యంలో దాడులు చేయగా హోటల్స్‌లో మిగిలిపోయిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లో ఉంచి వాటిని ఆ తర్వాత రోజు కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు గుర్తించారు.
ఫ్రిజ్ లో ఉంచిన చికెన్, మటన్, చేపల కర్రీలను అధికారులు పరీక్షించారు. కొన్నింటిని మూడునాలుగు రోజుల పాటు నిల్వ ఉంచినట్టు గుర్తించారు. కొన్ని పదార్ధాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నా సరే వాటిని నిల్వ ఉంచారు. మిగిలినపోయిన ఆహారపదార్థాలను తిరిగి వేడి చేసి హాట్ హాట్‌గా ఉన్నాయంటూ కస్టమర్ల చేత తినిపిస్తున్నారు.
భారీగా బిర్యానీ కూడా నిల్వ ఉంచినట్టు గుర్తించారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆహారపదార్దాల్లో వాడకూడని రంగులను కూడా వాడినట్టు నిర్ధారించారు. సీజ్ చేసిన ఆహార పదార్ధాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్టు విజిలెన్స్ అధికారులు చెప్పారు.
నివేదిక రాగానే సదరు హోటల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు. హాటల్స్‌కు వెళ్లిన సమయంలో ఆహారపదార్ధాలు పాడైనట్టు అనిపిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని విజిలెన్స్, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రజలకు సూచించారు.