శరీరంలో ఐరన్ లోపిస్తే.... ఈ మార్పులు వస్తాయి!
మన శరీరానికి ఆయువు రక్తం. రక్తం లేదంటే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. మన శరీరానికి రక్తం ఎంత అవసరమో…ఐరన్ కూడా అంతే అవసరం. శరీరంలో ఐరన్ ఏమాత్రం తగ్గినా…అనారోగ్యానికి గురికావల్సిందే. కాబట్టి ఐరన్ లోపం ఉండకుండా చూసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే…శరీరానికి కావాల్సినంత రక్తం అందుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఐరన్ మనల్ని కాపాడుతుంది. శరీరంలో ఐరన్ లోపించినట్లయితే… అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఐరన్ లోపిస్తే…. 1. శరీరంలో ఐరన్ లోపిస్తే […]
మన శరీరానికి ఆయువు రక్తం. రక్తం లేదంటే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. మన శరీరానికి రక్తం ఎంత అవసరమో…ఐరన్ కూడా అంతే అవసరం. శరీరంలో ఐరన్ ఏమాత్రం తగ్గినా…అనారోగ్యానికి గురికావల్సిందే. కాబట్టి ఐరన్ లోపం ఉండకుండా చూసుకోవాలి.
ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే…శరీరానికి కావాల్సినంత రక్తం అందుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఐరన్ మనల్ని కాపాడుతుంది. శరీరంలో ఐరన్ లోపించినట్లయితే… అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
ఐరన్ లోపిస్తే….
1. శరీరంలో ఐరన్ లోపిస్తే తొందరగా అలసిపోతారు. చికాకుగా ఉంటుంది. వీక్ అయిపోతారు. ఏకాగ్రత లోపిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
2. ఒళ్లంతా దురదగా ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు కాళ్లు అదే పనిగా కదుపుతున్నారంటే… మీకు ఐరన్ లోపం ఉందని చెప్పవచ్చు. ఒళ్లంత అదేపనిగా గోకడం చేసినా…. ఐరన్ లోపించిందనే సంకేతం. వీటితోపాటు తరచుగా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే ఐరన్ లోపం వల్ల బ్రెయిన్ లోని రక్త నాళాలు బాగా ఉబ్బి తలనొప్పి రావడానికి కారణమవుతాయి.
3. ఐరన్ లోపం ఉన్నవాళ్లు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతుంటారు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది. బరువు పెరుగుతారు. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. జుట్టు ఊడిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే డాక్టర్ ను సంప్రదించాలి.
శరీరానికి ఐరన్ అందాలంటే….
1. నిత్యం మీరు తీసుకునే ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకోండి.
2. ఎరుపు రంగు పండ్లతోపాటు… పండు మిరపకాయాలు, బీట్ రూట్, టమాటాలు ప్రతిరోజూ ఆహారంలో ఉండేలా అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు యాపిల్ రోజుకు ఒక్కటి తినండి. ఎర్రగా ఉండే పండ్లలో ఐరన్ ఎక్కువ శాతం ఉంటుంది.
అందువల్ల ఎరుపు రంగు ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.