మీటూ దెబ్బకు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో ఆవేదన
మీటూ ఆరోపణలతో కలత చెందిన ఒక కంపెనీ ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. జెన్‌ప్యాక్ట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న స్వరూప్ రాజ్ పై కంపెనీలో ఇద్దరు మహిళా ఉద్యోగులు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో స్వరూప్ రాజ్‌ను కంపెనీ సస్పెండ్ చేసింది. వ్యవహారం తేలే వరకు కంపెనీలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కంపెనీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వరూప్ రాజ్ అవమానకరంగా భావించారు. నోయిడాలోని ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. […]
మీటూ ఆరోపణలతో కలత చెందిన ఒక కంపెనీ ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. జెన్‌ప్యాక్ట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న స్వరూప్ రాజ్ పై కంపెనీలో ఇద్దరు మహిళా ఉద్యోగులు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో స్వరూప్ రాజ్‌ను కంపెనీ సస్పెండ్ చేసింది. వ్యవహారం తేలే వరకు కంపెనీలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
కంపెనీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వరూప్ రాజ్ అవమానకరంగా భావించారు. నోయిడాలోని ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 2007లో సంస్థలోకి స్వరూప్ రాజ్ అడుగుపెట్టారు. ఇతడి స్వస్థలం కేరళలోని ఎర్నాకులం. భార్యతో కలిసి నోయిడాలో నివాసం ఉంటున్నారు. స్వరూప్ రాజ్ భార్య కీర్తి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు.
భార్య ఇంటిలో లేని సమయంలో స్వరూప్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన భార్య … స్వరూప్ చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వీరికి రెండేళ్ల క్రితమే పెళ్లి అయింది.
చనిపోయే ముందు స్వరూప్ …సూసైడ్ నోట్ కూడా రాశారు. తనపై ఇద్దరు ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు చేశారని… కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని నోట్‌లో భార్యకు వివరించారు. విషయం కంపెనీ మొత్తం తెలిసిపోయిందని… కాబట్టి ఈ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం తనకు లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో వివరించాడు స్వరూప్.