పెట్టుబడుల ఆకర్షణలో దిగజారిన ఏపీ ర్యాంకు

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతూ వచ్చారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్‌ సమాధానం ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు దిగజారిపోయిందని వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో 2016 ఏడాదికి ఏపీ నాలుగో స్థానంలో ఉండేది. 2017లో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది మాత్రం ఏపీ […]

Advertisement
Update:2018-12-19 03:05 IST

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతూ వచ్చారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్‌ సమాధానం ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు దిగజారిపోయిందని వెల్లడించారు.

పెట్టుబడుల ఆకర్షణలో 2016 ఏడాదికి ఏపీ నాలుగో స్థానంలో ఉండేది. 2017లో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది మాత్రం ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో చాలా వెనుకబడిపోయింది. ఏకంగా నాలుగు ర్యాంకులు దిగజారిపోయింది. ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఏడో స్థానంతో సరిపెట్టుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News