ఆ ఓడిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంత పనిచేశాడా?
ఆయనో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా వివాదాలు చెలరేగాయి. ఆయన ఆస్తులపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. కొన్ని వివాదాల్లో ఆయన తలదూర్చాడు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఖర్చు కోసం ఆస్తులను అమ్ముకున్నారు. అయితే 2014లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. సింపతీ వర్క్‌వుట్ అయింది. ఆయన కల నెరవేరింది. […]
ఆయనో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా వివాదాలు చెలరేగాయి. ఆయన ఆస్తులపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. కొన్ని వివాదాల్లో ఆయన తలదూర్చాడు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఖర్చు కోసం ఆస్తులను అమ్ముకున్నారు. అయితే 2014లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. సింపతీ వర్క్‌వుట్ అయింది. ఆయన కల నెరవేరింది. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ నాలుగేళ్లలో ఆయన చాలా వివాదస్పద ఎమ్మెల్యేగా పేరు పడ్డారు. ఇందులో ఆయన కొంత చేసుకుంటే….ప్రత్యర్థులు కొంత తయారు చేశారు. ఆయన ఇమేజ్‌కు డ్యామేజీ అయింది.
ఎన్నికల వేళ గ్రాఫ్ పడిపోవడంతో గులాబీ బాస్ హెచ్చరించారు. దీంతో నియోజకవర్గంలో పలుకుబడి పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు దగ్గరయ్యారు. సామూహిక వివాహ కార్యక్రమాలు జరిపించారు. పుస్తెమట్టలే కాదు. కొత్త బట్టలు,కట్న కానుకలు ఇచ్చి పెళ్లి జరిపించారు. అంతేకాదు ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఎన్నికల్లో తనకు ఓట్లు రాలుతాయని ఆయన ఆశించారు.
తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే భారీ తేడాతో ఆయన ఓడిపోయారు. తాము చేపట్టిన సామూహిక వివాహాలు, సంక్షేమ కార్యక్రమాలే తమకు ఓట్లు రాలుస్తాయని ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎన్నికల్లో డబ్బు ఎందుకు పంచడం…తాము పెళ్లిళ్లు చేశాం…పేదలను ఆదుకున్నాం…ఇంకెందుకు డబ్బులు పంచాలని అనుకున్నారు.
ఆయన భార్య ఇదే విషయం ఎమ్మెల్యేకు చెప్పింది. డబ్బులు పంచొద్దు. ఇప్పటికే చాలా చేశాం…జనం ఓట్లు వేస్తారని హితబోధ చేసింది. చివరకు చూస్తే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ ఎమ్మెల్యేకు కోపం పీక్ స్టేజీకి చేరిందట. నువ్వు చెప్పడం వల్లే ఎన్నికల్లో డబ్బు పంచలేదు….ప్రత్యర్థి ఇంటికి రెండు వేల రూపాయలు పంచాడు.
దీంతో ఓట్లు అన్నీ అటు పడ్డాయని భార్యపై చేయి చేసుకున్నాడట. అంతేకాదు…ఇంట్లో సామానులు విసిరి వేశాడట. టీవీ పగులగొట్టాడట. మొత్తానికి ఆయనగారి కోపం చూసి అనుచరులే రెండు రోజులు దగ్గరకు వెళ్లలేదని సమాచారం.
మొత్తానికి భార్య మాట విని తాను ఓడిపోయానని ఆ మాజీ ఎమ్మెల్యే వాపోతున్నాడు. డబ్బులు పంచకపోతే ఈ రోజుల్లో ఓట్లు వేయరని… తన నియోజకవర్గం పక్క ఎమ్మెల్యే…. విద్యాసంస్థలు నడుపుతున్న ఆయన దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాడని, తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు అది మరో ప్లస్ పాయింట్ అయిందని ఆ మాజీ ఎమ్మెల్యే చెబుతున్నాడు.