పోలవరంలో అక్రమాలు నిజమే " కేంద్ర మంత్రి ప్రకటన
పోలవరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై కేంద్రమంత్రి తేల్చిచెప్పారు. పోలవరం పనుల్లో అక్రమాలు నిజమేనని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అంగీకరించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేటప్పుడు అక్రమాలు జరిగాయని వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి…. ప్రాజెక్టులో అక్రమాలు నిజమేనని తెలియజేశారు. నిబంధనలకు విరుద్దంగా పోలవరం కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపు జరిగిందని…. ఇది వరకే ప్రాజెక్టు అథారిటీతో పాటు కాగ్ కూడా స్పష్టం చేసింది. కాగ్ చెప్పినట్టు అక్రమాలు […]
పోలవరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై కేంద్రమంత్రి తేల్చిచెప్పారు. పోలవరం పనుల్లో అక్రమాలు నిజమేనని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అంగీకరించారు.
కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేటప్పుడు అక్రమాలు జరిగాయని వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి…. ప్రాజెక్టులో అక్రమాలు నిజమేనని తెలియజేశారు.
నిబంధనలకు విరుద్దంగా పోలవరం కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపు జరిగిందని…. ఇది వరకే ప్రాజెక్టు అథారిటీతో పాటు కాగ్ కూడా స్పష్టం చేసింది. కాగ్ చెప్పినట్టు అక్రమాలు జరిగిన మాట నిజమేనని కేంద్రమంత్రి అంగీకరించారు.