ఎన్‌ఐఏ చేతికి కిడారి హత్య కేసు... మరి జగన్ కేసు ?
ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన కేసు ఎన్‌ఐఏ చేతికి వెళ్లింది. ఎమ్మెల్యే హత్య కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్‌ఐఏను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్‌ఐఏకి పోలీసులు అప్పగించారు. సెప్టెంబర్ 23న కిడారి మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ కేసును విశాఖ జిల్లా పోలీసులు విచారిస్తున్నారు. ఇంతలో నవంబర్ 30న కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్‌ఐఏను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఈనెల 6న కేసును […]
ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన కేసు ఎన్‌ఐఏ చేతికి వెళ్లింది. ఎమ్మెల్యే హత్య కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్‌ఐఏను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్‌ఐఏకి పోలీసులు అప్పగించారు.
సెప్టెంబర్ 23న కిడారి మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ కేసును విశాఖ జిల్లా పోలీసులు విచారిస్తున్నారు. ఇంతలో నవంబర్ 30న కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్‌ఐఏను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఈనెల 6న కేసును హైదరాబాద్ ఎన్‌ఐఏ యూనిట్ కేసును స్వాధీనం చేసుకుంది.
కిడారి హత్య దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. పైగా జగన్‌పై దాడి జరిగింది కేంద్ర పరిధిలోకి ఎయిర్‌పోర్టులో.
దీనికి తోడు హైకోర్టు కూడా జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించడం లేదని కేంద్రాన్ని పదేపదే ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ కుట్రతో ముడిపడి ఉన్న జగన్ కేసును మోడీ సర్కార్ ఎన్‌ఐఏకు అప్పగిస్తుందా లేక… చంద్రబాబు ప్రభుత్వానికే కేసును వదిలేస్తుందా అన్నది చూడాలి.