అమాయక ఆంధ్రులు కొట్టండి చప్పట్లు....

కిందపడ్డా తనదే పై చేయి అని ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని మించిన పార్టీ మరొకటి లేదు. తాను చేస్తే శృంగారం…. మరెవరైనా చేస్తే వ్యభిచారం…. అన్నది బాగా నమ్మిన పార్టీ టీడీపీ. ఏది చేసినా తామే చేయాలి గానీ పక్కోడు చేయడం ఏమిటనే అహంభావం నరనరాల్లో టీడీపీలో జీర్ణించుకుపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు మరో తాజా ఉదాహరణ ఇది. టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ, జనసేన ఆనందపడడం ఏమిటి అన్నది టీడీపీ మంత్రుల ప్రశ్న. రాష్ట్రాన్ని విడగొట్టిన […]

Advertisement
Update:2018-12-14 01:40 IST

కిందపడ్డా తనదే పై చేయి అని ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని మించిన పార్టీ మరొకటి లేదు. తాను చేస్తే శృంగారం…. మరెవరైనా చేస్తే వ్యభిచారం…. అన్నది బాగా నమ్మిన పార్టీ టీడీపీ.

ఏది చేసినా తామే చేయాలి గానీ పక్కోడు చేయడం ఏమిటనే అహంభావం నరనరాల్లో టీడీపీలో జీర్ణించుకుపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు మరో తాజా ఉదాహరణ ఇది.

టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ, జనసేన ఆనందపడడం ఏమిటి అన్నది టీడీపీ మంత్రుల ప్రశ్న. రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్‌ గెలిస్తే సంబరం ఎందుకని మంత్రులు, సీనియర్ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు.

ఇది ఎలాగుందంటే ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని… తిరిగి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించండని చంద్రబాబు నీతి పలుకులు పలికినట్టుగా ఉంది.

టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ, జనసేన పార్టీలు శుభాకాంక్షలు చెప్పడాన్నే టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరీ ఇదే చంద్రబాబు హరికృష్ట శవం పక్కనే కుర్చీ వేసుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కేటీఆర్‌తో బేరాలు అడిగింది నిజం కాదా! అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలనుకున్నాను… కానీ కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కాంగ్రెస్‌తో జత కట్టానని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మరి రాష్ట్ర విభజనకు కారణమైన టీఆర్‌ఎస్‌తో హరికృష్ణ శవం సాక్షిగా పొత్తుకోసం ప్రయత్నాలు చేయడం ఏమిటని మాత్రం టీడీపీ నేతలను ప్రశ్నించకూడదన్న మాట.

ఇదే కేసీఆర్‌ ఏపీకి వస్తే రకరకాల వంటలు చేసి రాచమర్యాదలు చంద్రబాబు చేసినప్పుడు తప్పు లేదన్నప్పుడు…. కేవలం పొరుగు రాష్ట్రంలో ఒక పార్టీ గెలిస్తే వైసీపీ, జనసేనలు శుభాకాంక్షలు చెప్పడం తప్పేలా అవుతుందని…. పాత విషయాలను గుర్తు చేస్తున్నారు.

అంతే మరీ… మీడియా మొత్తం మెడలో వేసుకుని తిరుగుతున్న చంద్రబాబు ఏమీ చేసినా అది శృంగారమేనని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News