హాకీ ప్రపంచకప్ లో భారత్ కు నేడే అసలు పరీక్ష

భారత్ రయ్ రయ్… హాలెండ్ సై..సై ఆఖరి క్వార్టర్ ఫైనల్లో భారత్ కు హాలెండ్ గండం రాత్రి 7 గంటల నుంచి భారత్- డచ్ ఫైట్ హాకీ ప్రపంచకప్ సెమీఫైనల్స్ బెర్త్ కు… మాజీ చాంపియన్ భారత్ మరోసారి గురిపెట్టింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్ -సీ లీగ్ టాపర్ గా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించిన 5వ ర్యాంకర్ భారత్… సెమీస్ లో చోటు కోసం జరిగే […]

Advertisement
Update:2018-12-13 06:30 IST
  • భారత్ రయ్ రయ్… హాలెండ్ సై..సై
  • ఆఖరి క్వార్టర్ ఫైనల్లో భారత్ కు హాలెండ్ గండం
  • రాత్రి 7 గంటల నుంచి భారత్- డచ్ ఫైట్

హాకీ ప్రపంచకప్ సెమీఫైనల్స్ బెర్త్ కు… మాజీ చాంపియన్ భారత్ మరోసారి గురిపెట్టింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్ -సీ లీగ్ టాపర్ గా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించిన 5వ ర్యాంకర్ భారత్… సెమీస్ లో చోటు కోసం జరిగే ఆఖరి క్వార్టర్ ఫైనల్లో పవర్ ఫుల్ హాలెండ్ తో తలపడనుంది.

రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది. అయితే…ప్రపంచ మాజీచాంపియన్ హాలెండ్ ప్రత్యర్థిగా భారత్ రికార్డు ఏమంత గొప్పగాలేదు.

డచ్ ముందు భారత్ వెలవెల…

ఇప్పటి వరకూ డచ్ జట్టుతో ఆరుసార్లు తలపడిన భారత్ కు…. ఐదు పరాజయాలు, ఓ డ్రా రికార్డు మాత్రమే ఉంది.

ఓవరాల్ గా హాలెండ్ తో 105 మ్యాచ్ లు ఆడిన భారత్… 33 విజయాలు, 48 పరాజయాలు, ఓ డ్రా రికార్డుతో ఉన్నాయి.

1975 ప్రపంచకప్ లో చివరిసారిగా సెమీస్ చేరిన భారత్ తాజాగా మరోసారి సెమీస్ బెర్త్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

రెండుజట్ల ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే… సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు జట్ల సమరం… ఆట ముగిసే క్షణాల వరకూ.. నువ్వానేనా అన్నట్లుగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News