ర్యాలీలకు అనుమతి లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 11వ తేదీన ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, వాటిపై నిషేధం విధించినట్లు రాష్ట్ర అడిషనల్ డీజీ జితేందర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని…. సీసీ కెమేరాలతో ప్రత్యేక నిఘాను కూడా ఉంచామని ఆయన తెలిపారు. ప్రతీ లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుందని.. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించే వారిపై కేసులు […]

Advertisement
Update:2018-12-11 01:45 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 11వ తేదీన ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, వాటిపై నిషేధం విధించినట్లు రాష్ట్ర అడిషనల్ డీజీ జితేందర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని…. సీసీ కెమేరాలతో ప్రత్యేక నిఘాను కూడా ఉంచామని ఆయన తెలిపారు.

ప్రతీ లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుందని.. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలన్న డీజీపీ ఆదేశాలు అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ సెంటర్లలోకి సెల్‌ఫోన్లు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలకు డిసెంబర్ 12 నుంచి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News