21 ఏళ్ల వయసులోనే రిషభ్ పంత్ టెస్ట్ ప్రపంచ రికార్డు

అడిలైడ్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ ప్రపంచ రికార్డు రెండుఇన్నింగ్స్ లో 11 క్యాచ్ లు పట్టిన రిషభ్ పంత్ జాక్ రస్సెల్, ఏబీ డివిలియర్స్ సరసన రిషభ్ పంత్ ఆస్ట్రేలియాతో అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ మ్యాచ్ లో…టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్…రిషభ్ పంత్…ప్రపంచ రికార్డు మొనగాళ్లు జాక్ రస్సెల్, ఏబీ డివిలియర్స్ ల సరసన చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియాను రెండుసార్లు ఆలౌట్ చేయడంలో రిషభ్ పంత్ ప్రధానపాత్ర వహించాడు. ఒకటికాదు రెండు […]

Advertisement
Update:2018-12-10 11:14 IST
  • అడిలైడ్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ ప్రపంచ రికార్డు
  • రెండుఇన్నింగ్స్ లో 11 క్యాచ్ లు పట్టిన రిషభ్ పంత్
  • జాక్ రస్సెల్, ఏబీ డివిలియర్స్ సరసన రిషభ్ పంత్

ఆస్ట్రేలియాతో అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ మ్యాచ్ లో…టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్…రిషభ్ పంత్…ప్రపంచ రికార్డు మొనగాళ్లు జాక్ రస్సెల్, ఏబీ డివిలియర్స్ ల సరసన చోటు సంపాదించాడు.

ఆస్ట్రేలియాను రెండుసార్లు ఆలౌట్ చేయడంలో రిషభ్ పంత్ ప్రధానపాత్ర వహించాడు. ఒకటికాదు రెండు కాదు…ఏకంగా 11 క్యాచ్ లు పట్టి వారేవ్వా అనిపించుకొన్నాడు. వృద్ధిమాన్ సాహా పేరుతో ఉన్న పది క్యాచ్ ల భారత రికార్డును 21 ఏళ్ల రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు.

1995లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ వికెట్ కీపర్ జాక్ రస్సెల్ 11 క్యాచ్ లు పట్టి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత 18 ఏళ్లకు…పాకిస్థాన్ పై సౌతాఫ్రికా వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్ సైతం 11 క్యాచ్ లే పట్టి….ప్రపంచ రికార్డు సమం చేశాడు.

2013 ప్రపంచ రికార్డు తర్వాత…ఐదేళ్లకు …అడిలైడ్ ఓవల్ లో రిషబ్ పంత్ సైతం 11 క్యాచ్ లే పట్టి…రస్సెల్, డివిలియర్స్ ల సరసన నిలవడమే కాదు…సంయుక్త ప్రపంచ రికార్డు హోల్డర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్ లో ఆరు క్యాచ్ లు పట్టిన రిషభ్ పంత్…రెండో ఇన్నింగ్స్ లో మరో ఐదు క్యాచ్ లు పట్టడం విశేషం.

Tags:    
Advertisement

Similar News