అప్పుడే గవర్నర్ వద్దకు కూటమి నేతలు

మహాకూటమి 80 స్థానాల్లో గెలుస్తుందని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు… మహాకూటమి నేతలు హంగ్‌ రాగం ఆలపిస్తున్నారు. హంగ్ అయినా రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ హంగ్‌ వస్తే గవర్నర్‌ పాత్ర కీలకం అవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ హంగ్‌ వస్తే తమనే ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కోరనున్నారు. సాధారణంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన వారిని గవర్నర్‌ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో మహాకూటమిలోని అన్ని […]

Advertisement
Update:2018-12-10 03:25 IST

మహాకూటమి 80 స్థానాల్లో గెలుస్తుందని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు… మహాకూటమి నేతలు హంగ్‌ రాగం ఆలపిస్తున్నారు. హంగ్ అయినా రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ హంగ్‌ వస్తే గవర్నర్‌ పాత్ర కీలకం అవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ హంగ్‌ వస్తే తమనే ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కోరనున్నారు. సాధారణంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన వారిని గవర్నర్‌ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తుంటారు.

ఈ నేపథ్యంలో మహాకూటమిలోని అన్ని పార్టీలదీ ఒకే మాట అని… తాము వేరువేరు పార్టీలు అయినా కూటమిగా పోటీ చేసినందున హంగ్‌ వస్తే తొలుత తమనే ఆహ్వానించాలని కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కూటమి గవర్నర్‌ను కలిసి కోరనుంది. నేడు గవర్నర్‌ను కలిసి దీనిపై వినతిపత్రం అందజేయనున్నారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ఎంఐఎంను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంఐఎంకు ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఖచ్చితంగా వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో హంగ్‌ వస్తే టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు అత్యవసరం అవుతుంది. కాబట్టి ఎంఐఎంను టీఆర్‌ఎస్ వైపు నిలవకుండా చేసేందుకు ఏఐసీసీ స్థాయిలో కొందరు పెద్దలు పావులు కదుపుతున్నారు.

అదే సమయంలో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు కాంగ్రెస్ వల విసురుతోంది. గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న నలుగురు ఇండిపెండెంట్లతో ఇప్పటికే పీసీసీ ముఖ్యనేతలు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. వారికి భారీగా ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం. ఇండిపెండెంట్‌లను ఆకర్షించే విషయంలో టీడీపీ ఆర్థికంగా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తోందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News