పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై సస్పెన్స్ వీడింది. పోలింగ్ ముగిసిన 26 గంటల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగా పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ నమోదు అయింది. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై సస్పెన్స్ వీడింది. పోలింగ్ ముగిసిన 26 గంటల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగా పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ నమోదు అయింది. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓట్ల నమోదు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ పోలింగ్ ఎవరికి నష్టం? ఎవరికి లాభం చేకూరుస్తుందోనని…. విశ్లేషణలు మొదలయ్యాయి. లగడపాటి రాజగోపాల్ 72 శాతం పోలింగ్ అంచనాతో తన సర్వే ప్రకటించాడు. ఇప్పుడు ఒక శాతం పోలింగ్ పెరిగింది. దీంతో మళ్లీ అంచనాలు ఎక్కువయ్యాయి.
పోలింగ్ శాతం పెరగడం వల్ల అధికారిక పార్టీకి నష్టమా? ప్రతిపక్షానికి లాభమా? అనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం దేనికి సంకేతం అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభమని గులాబీ పార్టీ నేతల భావన.
తమ సంక్షేమ కార్యక్రమాలకు రూరల్ ఏరియాలో ఆదరణ ఉండడం వల్లే జనం పెద్ద ఎత్తున ఓట్లు వేశారని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు పథకం వల్ల నగరాలు, పట్టణాల్లో ఉంటున్న గ్రామీణ ప్రాంతాల వాళ్లు వెళ్లి ఓటు వేశారని చెప్పుకొస్తున్నారు.
అయితే ఇటు ప్రతిపక్షం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు పెరగడం తమకు అనుకూలిస్తుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే జనం పల్లెలకు వెళ్లి కసిగా ఓటు వేశారని… ఇది తమకు లాభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓట్లు…. టోటల్‌గా పెరిగిన ఓట్ల శాతం ఎవరికి లాభిస్తుందో తెలియాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే.