ఏపీలో స్వైన్ ఫ్లూ కలకలం.... ఊరుఊరంతా వెలి

ఏపీలోని కృష్ణా జిల్లా చింతకోళ్ల గ్రామంలో ఆదివారం ఉదయం కలకలం చెలరేగింది. ఊరు ఊరంతా స్వైన్ ఫ్లూ వ్యాపించిందని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో సమీపంలోని చుట్టుపక్కల గ్రామాలంతా ఆ ఊరిని వెలివేశాయి. ఆ ఊళ్లోకి కూరగాయలు, ఇతర అవసరాల కోసం ఎవ్వరూ పోవడం లేదు. పాలు, నిత్యవసరాలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వైన్ ఫ్లూ గ్రామంలో వ్యాపించిందని.. చాలా మందికి సోకిందని చింతకోళ్ల గ్రామంలో పుకార్లు వ్యాపించాయి. ఊరు ఊరంతా చనిపోవడం ఖాయమని […]

Advertisement
Update:2018-12-09 05:30 IST

ఏపీలోని కృష్ణా జిల్లా చింతకోళ్ల గ్రామంలో ఆదివారం ఉదయం కలకలం చెలరేగింది. ఊరు ఊరంతా స్వైన్ ఫ్లూ వ్యాపించిందని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో సమీపంలోని చుట్టుపక్కల గ్రామాలంతా ఆ ఊరిని వెలివేశాయి. ఆ ఊళ్లోకి కూరగాయలు, ఇతర అవసరాల కోసం ఎవ్వరూ పోవడం లేదు. పాలు, నిత్యవసరాలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్వైన్ ఫ్లూ గ్రామంలో వ్యాపించిందని.. చాలా మందికి సోకిందని చింతకోళ్ల గ్రామంలో పుకార్లు వ్యాపించాయి. ఊరు ఊరంతా చనిపోవడం ఖాయమని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా స్వైన్ ఫ్లూ అని తెలియడంతో వైద్యులు, అధికారులు కూడా అక్కడికి వెళ్లడానికి భయపడిపోతున్నారు.

బయట నుంచి వచ్చిన కొంతమందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వారి బంధువులు, సమీప వ్యక్తులకు కూడా ఈ లక్షణాలు వచ్చాయి. దీంతో ఇదే స్వైన్ ఫ్లూ అంటూ గ్రామంలో అందరూ భయంతో పారిపోతున్నారు. వీరిని పక్క గ్రామాల ప్రజలు ఊళ్లోకి రానీయడం లేదు.

ఈ విషయమై కృష్ణా జిల్లా కలెక్టర్, యంత్రాంగం స్పందించింది. అక్కడికి వెంటనే వైద్య బృందం, పోలీసులను పంపనున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. అసలు స్వైన్ ఫ్లూ ఉందా.? ఇవి పుకార్లా అనే విషయంపై ఆరాతీస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News