అడిలైడ్ టెస్ట్ మూడో రోజు ఆటలోనే టీమిండియా పట్టు

తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్ రెండోఇన్నింగ్స్ లో టీమిండియా 3 వికెట్లక 151 పరుగులు 166 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో టీమిండియా అడిలైడ్ టెస్ట్ మూడోరోజు ఆటలోనే టీమిండియా పైచేయి సాధించింది. తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 235 పరుగులకు పరిమతం చేసిన టీమిండియా… 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ …మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 151 పరుగుల స్కోరు సాధించింది. ఓవరాల్ గా 166 పరుగుల ఆధిక్యం సంపాదించింది. […]

Advertisement
Update:2018-12-08 13:10 IST
  • తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్
  • రెండోఇన్నింగ్స్ లో టీమిండియా 3 వికెట్లక 151 పరుగులు
  • 166 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో టీమిండియా

అడిలైడ్ టెస్ట్ మూడోరోజు ఆటలోనే టీమిండియా పైచేయి సాధించింది. తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 235 పరుగులకు పరిమతం చేసిన టీమిండియా… 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ …మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 151 పరుగుల స్కోరు సాధించింది.

ఓవరాల్ గా 166 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు…. ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను మిడిలార్డర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 72 పరుగుల స్కోరుతో ఆదుకొన్నాడు.

టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు, ఇశాంత్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత రెండోఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనింగ్ జోడీ రాహుల్-విజయ్ మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

విజయ్ 18, రాహుల్ 44, కెప్టెన్ విరాట్ కొహ్లీ 34 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు. వన్ డౌన్ పూజారా 40, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఒక్క పరుగు స్కోరుతో క్రీజులో ఉన్నారు. ఆట ముగియటానికి ఆఖరి రెండురోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది.

కొహ్లీ ఖాతాలో మరో రికార్డు….

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ… తన రికార్డుల ఖాతాలో… మరో సరికొత్త రికార్డు జమ చేసుకొన్నాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆట రెండో ఇన్నింగ్స్ లో…. కొహ్లీ స్కోరు 30 పరుగులు దాటిన సమయంలో…. కంగారూ గడ్డపై వెయ్యి పరుగుల మైలు రాయిని చేరాడు.

హేమాహేమీల సరసన….

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా పై అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన టీమిండియా తొలి క్రికెటర్ గా నిలిచాడు.

కంగారూ గడ్డపై 1000 పరుగులు సాధించిన నాలుగో భారత క్రికెటర్ గా కొహ్లీ నిలిచాడు.గతంలో ఇదే ఘనత సాధించిన మొనగాళ్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఉన్నారు.

అడిలైడ్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులకే అవుటైన కొహ్లీ…రెండో ఇన్నింగ్స్ లో 34 పరుగులే సాధించడం విశేషం.

రెండో ఇన్నింగ్స్ లో 104 బంతులు ఎదుర్కొనడం ద్వారా నిలదొక్కుకోడానికి ప్రయత్నించిన కొహ్లీ చివరకు ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ బౌలింగ్ లో..షార్ట్ లెగ్ లో ఫించ్ పట్టిన క్యాచ్ కు దొరికిపోయాడు.

ఆస్ట్రేలియాలో తన లక్కీ గ్రౌండ్ అడిలైడ్ ఓవల్ లో కొహ్లీ ప్రస్తుత సిరీస్ లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

Tags:    
Advertisement

Similar News