ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... టీఆర్‌ఎస్‌దే హవా

తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే తిరిగి అధికారమని టైమ్స్‌ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వే చెబుతోంది. ఈ సంస్థ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు ,కాంగ్రెస్‌కు 37 స్థానాలు దక్కనున్నాయి. బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ వెల్లడించింది. ఇతరులు తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తారని చెబుతోంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే.. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్ సర్వే ప్రకారం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ స్వీప్‌ చేయబోతోంది. టీఆర్‌ఎస్ 79 నుంచి 91 స్థానాలను సొంతం […]

Advertisement
Update:2018-12-07 12:30 IST

తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే తిరిగి అధికారమని టైమ్స్‌ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వే చెబుతోంది. ఈ సంస్థ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు ,కాంగ్రెస్‌కు 37 స్థానాలు దక్కనున్నాయి. బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ వెల్లడించింది. ఇతరులు తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తారని చెబుతోంది.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే..

ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్ సర్వే ప్రకారం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ స్వీప్‌ చేయబోతోంది. టీఆర్‌ఎస్ 79 నుంచి 91 స్థానాలను సొంతం చేసుకోనుంది. మహాకూటమి కేవలం 21 నుంచి 33 స్థానాలను గెలవచ్చు. ఎంఐఎం 4 నుంచి ఏడు స్థానాలు, బీజేపీ ఒకటి నుంచి మూడుస్థానాలు గెలవచ్చు అని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది.

ఇండియా టుడే ప్రకారం పార్టీల ఓట్ల శాతం

టీఆర్‌ఎస్ కు 46 శాతం,
మహాకూటమికి 37 శాతం,
బీజేపీకి ఏడు శాతం,
ఎంఐఎంకు 3శాతం ఓటింగ్ రానుంది.

తెలంగాణలో రిపబ్లిక్ జన్‌కీబాత్ సర్వే

టీఆర్ఎస్ 50 నుంచి 65,
మహకూటమి 38 నుంచి 52 స్థానాలు గెలుచుకుంటుందని రిపబ్లిక్ జన్ కీబాత్ ఎగ్జిట్ పోల్స్ సర్వే చెబుతోంది.

ఆరా ఏజెన్సీ ఎగ్జిట్ పోల్స్ సర్వే

టీఆర్ఎస్ 75 నుంచి 85, కాంగ్రెస్ 25 నుంచి 35, ఎంఐఎం 7 నుంచి 8 , బీజేపీ 2 నుంచి మూడు, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News