ఓట్ల కోసం సొంత గూటికి...!

తెలంగాణలో పండగ వాతావరణం నెలకొంది. ఈనెల 7వ తేదీన జరగనున్న ఎన్నికలు… తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఆసక్తిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా… పక్కనున్న మహారాష్ట్రలోనూ ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రాలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఉపాధి కోసం మహారాష్ట్రకు వెళ్లిన వారంతా….ఇప్పుడు ఓట్ల పండగకు తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే తమ ప్రాంతాలకు చేరుకున్న కొందరు తమకిష్టమైన పార్టీ తరపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇక […]

Advertisement
Update:2018-12-06 05:10 IST

తెలంగాణలో పండగ వాతావరణం నెలకొంది. ఈనెల 7వ తేదీన జరగనున్న ఎన్నికలు… తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఆసక్తిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా… పక్కనున్న మహారాష్ట్రలోనూ ఆసక్తి నెలకొంది.

మహారాష్ట్రాలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఉపాధి కోసం మహారాష్ట్రకు వెళ్లిన వారంతా….ఇప్పుడు ఓట్ల పండగకు తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే తమ ప్రాంతాలకు చేరుకున్న కొందరు తమకిష్టమైన పార్టీ తరపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

ఇక ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారిపై దృష్టి సారించారు. ముంబాయి సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎక్కడున్నా….ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలతోపాటు కుటుంబంలో ఎక్కువ ఓట్లు ఉంటే మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు.

కాగా మహారాష్ట్రలో స్థిరపడిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. ముంబాయి భీవండి, షోలాపూర్, పుణేల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణవాళ్లు ఉంటారని అంచనా. అంతేకాదు ఒక్క ముంబై నగరంలోనే దాదాపు పదిలక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వీరిలో తెలంగాణవాళ్లే 70శాతం వరకు ఉంటారు. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందినవారే ఎక్కువ.

తర్వాత నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన వారు మహారాష్ట్రలో స్థిరపడ్డారు.

అంతేకాదు…. తెలంగాణ పార్టీలకు చెందిన కొందరు సానుభూతిపరులు ముంబైలోనూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు వెళ్లి ఓట్లేసేందుకు బస్సు , రైలు ఛార్జీలతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని హామీలిస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ సంస్థలు అయితే ఏకంగా ఓటు హక్కు ఉంటే 20శాతం రాయితీ కూడా ప్రకటించాయి.

Tags:    
Advertisement

Similar News